Sharwanand: తండ్రి కాబోతున్న శ‌ర్వానంద్‌?.. అమెరికాకు పయనం

ABN , First Publish Date - 2023-11-06T21:29:39+05:30 IST

తెలుగునాట విజ‌య‌వంత‌మైన హీరోగా కొన‌సాగుతున్న శ‌ర్వానంద్ నుంచి మ‌రో శుభ‌వార్త రానున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. జూన్‌లో ర‌క్షితా రెడ్డిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లో ఈ జంట త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Sharwanand: తండ్రి కాబోతున్న శ‌ర్వానంద్‌?.. అమెరికాకు పయనం
sharwanand

తెలుగునాట విజ‌య‌వంత‌మైన హీరోగా కొన‌సాగుతున్న శ‌ర్వానంద్(sharwanand) నుంచి మ‌రో శుభ‌వార్త రానున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌ముఖ హైకోర్టు న్యాయ‌వాది కుమార్తె అయిన ర‌క్షితా రెడ్డితో శ‌ర్వా ఎంగేజ్‌మెంట్ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రుగ‌గా.. జూన్‌లో కొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లో ఈ జంట త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటున్న ర‌క్షిత అక్క‌డే ఆస్ప‌త్రిలో చూయించుకుంటూ రెగ్యుల‌ర్‌గా చెక‌ప్‌ల‌కు వెళుతున్న‌ద‌ని, శ‌ర్వానంద్ కూడా అక్క‌డే కొంత‌కాలం భార్య‌కు సాయంగా ఉండేందుకు వెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. అక్క‌డే డెలివ‌రీ అనంత‌రం తిరిగి హైద్రాబాద్‌కు తిరిగి రానున్న‌ట్లు సమాచారం. అయితే ఈ వార్త‌ల విష‌యంలో శ‌ర్వా కానీ ఆయ‌న ఫ్యామిలీ గానీ అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.


శ‌ర్వానంద్ చివ‌ర‌గా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాలో న‌టించ‌గా.. ప్రస్తుతం ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్ర‌ముఖ న‌వ‌ల ఆధారంగా త‌న‌ 35వ చిత్రాన్ని చేస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్రగామి సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్న‌ది. ప్ర‌స్తుత ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్త‌వ‌డంతో సినిమాల‌కు బ్రేక్ ఇచ్చి.. తన భార్యను దగ్గరుండి చూసుకునేందుకు శర్వానంద్ అమెరికాకు వెళ్లినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి.

Updated Date - 2023-11-06T22:24:51+05:30 IST