Sharwanand: మూడు ముళ్లతో కొత్త జీవితంలోకి...అడుగేశారు

ABN , First Publish Date - 2023-06-04T15:03:40+05:30 IST

శర్వానంద్‌ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు స్వస్తి చెప్పారు. శనివారం రాత్రి రక్షితారెడ్డి మెడలో శర్వా మూడుముళ్లు వేశారు. వేద మంత్రాల సాక్షిగా ఏడడుగు వేశారు. ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Sharwanand: మూడు ముళ్లతో కొత్త జీవితంలోకి...అడుగేశారు

శర్వానంద్‌ (Sharwanand) బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు స్వస్తి చెప్పారు. శనివారం రాత్రి రక్షితారెడ్డి (Rakshitha reddy) మెడలో శర్వా మూడుముళ్లు వేశారు. వేద మంత్రాల సాక్షిగా ఏడడుగు వేశారు. ఇరు కుటుంబాల పెద్దలు సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. (Sharwa got Married) గురువారమే అక్కడికి చేరుకున్న ఇరుకుటుంబాలు రెండ్రోజులపాటు పెళ్లి తంతును నిర్వహించారు. శుక్రవారం హల్దీ కార్యక్రమాన్ని నిర్వహించగా, శనివారం మధ్యాహ్నాం సంగీత్‌ను ఏర్పాటు చేశారు. శర్వానంద్‌ ‘పూనకాలు లోడింగ్‌’ అంటూ పాటకు స్టెప్పులేస్తే కల్యాణ మండపంలో హుషారు పెంచారు.

Untitled-2.jpg

సుమారు రెండు రోజులపాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌, విక్కీ, సిద్దార్థ్‌, ఆదితిరావు హైదరీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘ఒకే ఒక జీవితం’ విజయం తర్వాత శర్వానంద్‌ శ్రీరామ్‌ ఆదిత్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు. పెళ్లి పనుల నిమిత్తం శర్వా కాస్త బ్రేక్‌ తీసుకున్నారు. త్వరలోనే ఆయన సెట్‌లో అడుగుపెడతారని సమాచారం.

2.jpg

Updated Date - 2023-06-04T16:15:05+05:30 IST