Shankar : ఇక దృష్టి అంతా విశ్వనాయకుడిపైనే!

ABN , First Publish Date - 2023-05-11T10:52:11+05:30 IST

శంకర్‌ (Shankar Shanmugham) సినిమా అంటేనే భారీతనం, రంగులమయం. చిత్రీకరణ సెట్స్‌ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్‌ కారు.

Shankar : ఇక దృష్టి అంతా విశ్వనాయకుడిపైనే!

శంకర్‌ (Shankar Shanmugham) సినిమా అంటేనే భారీతనం, రంగులమయం. చిత్రీకరణ సెట్స్‌ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్‌ కారు. రామ్‌చరణ్‌తో తీస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో (Game Changer) అదే ఫాలో అవుతున్నారు. గతంలో పోలిస్తే భారీతనం ఇంకా పెరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం క్లైమాక్‌ సిన్నివేశాలను చిత్రీకరించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో 1200 మందికిపైగా ఫైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టుల నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. క్లైమాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని శంకర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఎలక్ట్రిఫైయింగ్‌ క్లైమాక్స్‌ పూర్తయింది. ఇకపై ఫోకస్‌ అంతా ఇండియన్‌-2 (Indian 2) పైనే! బుధవారం నుంచి సిల్వర్‌ బులెట్‌ సీక్వెన్స్‌లో నిమగ్నం’’ అని పోస్ట్‌ చేశారు. విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ కథానాయికుడిగా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే ‘ఇండియన్‌2’ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. ఇటీవల తిరుపతి, టోక్యో ప్రాంతాల్లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే! దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్‌. కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నాయికలు. రామ్‌చరణ్‌ తెరకెక్కిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Untitled-1.jpg

Updated Date - 2023-05-11T10:55:57+05:30 IST