సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Indian 2: ప్రత్యేకతలేంటో తెలుసా?

ABN, First Publish Date - 2023-03-16T23:06:55+05:30

శంకర్‌ (Shankar) సినిమా అంటేనే భారీతనం. పెద్ద పెద్ద సెట్లు, కలర్‌ఫుల్‌ సాంగ్స్‌, కథతోపాటు ఇవి ఆయన బలం. తన చిత్రాల్లో ప్రతి పాట ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు శంకర్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకర్‌ (Shankar) సినిమా అంటేనే భారీతనం. పెద్ద పెద్ద సెట్లు, కలర్‌ఫుల్‌ సాంగ్స్‌, కథతోపాటు ఇవి ఆయన బలం. తన చిత్రాల్లో ప్రతి పాట ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు శంకర్‌. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ఇండియన్‌ 2’ (Indian2) చిత్రానికి ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. ఈ చిత్రంలో ప్రతి అంశం కొత్తగా ఉంటుందని ఇప్పటికే శంకర్‌ చెప్పారు. ఇందులో పాటలే కాదు ఫైట్లు కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. దీనికి కొత్త టెక్నాలజీని (new tecjnology for indian2 FIghts) ఉపయోగించనున్నారట. ఈ సినిమా కోసం ఓ భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేశారు. ఇదొక ట్రైన్‌ ఫైట్‌. విదేశీ టెక్నీషియన్స్‌ సాయంతో భారీ ఎత్తున ట్రైన్‌ సెట్‌ వేయబోతున్నారు శంకర్‌. ఈ ఫైట్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని చిత్ర బృందం చెబుతున్నారు. ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం వచ్చే వారం శంకర్‌, కమలహాసన్‌ బృందం వచ్చేవారం దక్షిణాఫ్రికా వెళ్తోంది. రెండు వారాలపాటు అక్కడ ఈ ఫైట్‌ చిత్రీకరణ ఉంటుందని తెలిసింది. శంకర్‌ గత చిత్రాల్లో కూడా ట్రైన్‌ సెట్స్‌, ఫైట్స్‌ ఉన్నాయి, కానీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. నూతన టెక్నాలజీ, విదేశీ టెక్నీషియన్లు పని చేయడం. ఈ మధ్యనే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఈ నెల మూడో వారంలో ట్రైన్‌ ఫైట్‌ కోసం దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. కమల్‌ హాసన్‌(kamal haasan) హీరోగా, లైకా ప్రొడక్షన్స్‌ (lyca productions) బ్యానర్‌ పై ఈ చిత్రం రూపొందుతోంది. రకుల్‌(Rakul preeth singh) , కాజల్‌ (kajal) ఈ చిత్రంలో నాయికలు.

Updated Date - 2023-03-17T00:17:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!