Game Changer: అగ్ర దర్శకుడికి శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2023-08-17T16:49:23+05:30 IST

అగ్ర దర్శకుడు శంకర్‌ పుట్టినరోజు వేడుకను సెట్‌లో నిర్వహించారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దిల్‌రాజు, రామ్‌చరణ్‌ సహా యూనిట్‌ సభ్యులు సెలబ్రేట్‌ చేశారు. దీనికి సంబంధిచిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Game Changer: అగ్ర దర్శకుడికి శుభాకాంక్షలు!

అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) పుట్టినరోజు వేడుకను సెట్‌లో నిర్వహించారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దిల్‌రాజు (Dil Raju) , రామ్‌చరణ్‌ (Ram charan) సహా యూనిట్‌ సభ్యులు సెలబ్రేట్‌ చేశారు. దీనికి సంబంధిచిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు శంకర్‌గా విషెస్‌ చెబుతున్నారు. ఆయన ఫిల్మ్‌ మేకింగ్‌ స్టైల్‌ను గురించి చెబుతున్నారు. కొందరైతే గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం ఎప్పుడు రిలీజ్‌ చేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ జంటగా దిల్‌ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రోబో 2.0’ తర్వాత శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఇండియన్‌ 2’ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రూపొందుతుంది. ఇందులో రామ్‌చరణ్‌ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రధారులు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-08-17T16:49:23+05:30 IST