SamanthaRuthPrabhu: 'శాకుంతలం' డేట్ ఫిక్స్ అయింది

ABN , First Publish Date - 2023-01-02T11:56:36+05:30 IST

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం (Director Gunasekhar's 'Shakuntalam' film release date fixed) లో సమంత రుత్ ప్రభు శకుంతలగా (Samantha Ruth Prabhu plays Shakuntala) చేసిన 'శాకుంతలం' పౌరాణిక సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు

SamanthaRuthPrabhu: 'శాకుంతలం' డేట్ ఫిక్స్ అయింది

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం (Director Gunasekhar's 'Shakuntalam' film release date fixed) లో సమంత రుత్ ప్రభు శకుంతలగా (Samantha Ruth Prabhu plays Shakunthala) చేసిన 'శాకుంతలం' పౌరాణిక సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు. ఆ సినిమా ఫిబ్రవరి 17వ (February 17) తేదీన విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతలు ఒక ప్రకటనలో తెలియచేసారు. సమంత శకుంతలాగా వేస్తె, మలయాళం నటుడు దేవ్ మోహన్ (Dev Mohan plays Dushyantha) దుశ్యంతుడుగా నటించాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా పూర్తి చేసేసారు. గత ఏడాది నవంబర్ లో విడుదల అవుతుందని మొదట ప్రకటించినా, ఈ సినిమా అప్పుడు విడుదల కాలేదు. కొత్త తేదీ మళ్ళీ ప్రకటిస్తామని ఆ తరువాత చెప్పారు. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవుతున్నందున, గుణశేఖర్ దర్శకత్వం లో వస్తున్నా ఈ సినిమా ఫిబ్రవరి 17 తేదీని ఫిక్స్ చేసేసారు.

shakuntalam1.jpg

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శకుడు గుణశేఖర్ కి ఒక మార్కు వుంది. అతను తన సినిమాల ద్వారా జాతీయ అవార్డు, నంది అవార్డులు గెలుచుకున్నాడు అంటే అతని ప్రతిభ ఏంటో అర్థం అవుతుంది. చిన్నపిల్లలతో రెండు దశాబ్దాల క్రితం 'రామాయణం'(Ramayanam) అనే సినిమా తీసి జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. జూనియర్ ఎన్ఠీఆర్ (Jr NTR) తాను పిల్లవాడిగా వున్నప్పుడు అందులో రాముడుగా వేసాడు. ఆ తరువాత గుణశేఖర్ చిరంజీవి, (Chiranjeevi) మహేష్ బాబు (Mahesh Babu) లతో మంచి సూపర్ హిట్ సినిమాలు తీయటమే కాకుండా, వాళ్ళకి స్టార్ డమ్ కూడా పెంచాడు. ఇంతకు ముందు 'రుద్రమదేవి' (Rudhramadevi) చారిత్రిక సినిమా తీసే అందరితో శెభాష్ అనిపించుకున్నాడు. అటువంటి గుణశేఖర్ ఇప్పుడు మళ్ళీ 'శాకుంతలం' పౌరాణిక సినిమాతో అందరి ముందుకు వస్తున్నాడు. ఇది మహా భారతంలోని కథ. గుణశేఖర్ తీశారు కాబట్టి, ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి, అలాగే సమంత శకుంతల గా నటించటం మరింత క్రేజ్ వచ్చింది. ఫిబ్రవరి 17 ఈ సినిమా కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2023-01-02T12:03:36+05:30 IST