Shaakuntalam: ఆమె కష్టాలు భూమాతకు సైతం భారమే!

ABN , First Publish Date - 2023-01-09T14:22:08+05:30 IST

సమంత కథానాయికగా నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుంచీ సినిమాపై అంచనాలున్నాయి. పైగా సమంత కథానాయికగా టైటిల్‌ పాత్ర పోషించడం, గుణశేఖర్‌ దర్శకుడు కావడం సినిమాకు మరింత హైప్‌ వచ్చింది.

Shaakuntalam: ఆమె కష్టాలు భూమాతకు సైతం భారమే!

సమంత (Samanta) కథానాయికగా నటిస్తున్న ‘శాకుంతలం(Shakuntalam) చిత్రం అనౌన్స్‌ చేసినప్పటి నుంచీ సినిమాపై అంచనాలున్నాయి. పైగా సమంత కథానాయికగా టైటిల్‌ పాత్ర పోషించడం, గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకుడు కావడం సినిమాకు మరింత హైప్‌ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. సోమవారం శాకుంతలం ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘ఈ భూమ్మీద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. అప్సరస బిడ్డ అయినా అనాధలా పుట్టిందే! శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది’ అంటూ ట్రైలర్‌ ప్రారంభమైన ట్రైలర్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది.

‘స్వచ్ఛమైన తన ప్రేమకోసం దుర్వాసుల వారి ఆగ్రహాగానికి, కశ్యప మహర్షుల అనుగ్రహానికి నడుమ ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే! అయితే కర్మకు ఎవరూ అతీతులు కారు’ అన్న డైలాగ్‌లు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో! అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించదు’ అంటూ సమంత పలికిన సంభాషణలను బట్టి ఆమె పాత్ర బరువైనదని అర్థమవుతోంది. దేవ్‌ మోహన్‌, సమంతల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటాయి. చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ హైలైట్‌ అని చెప్పొచ్చు. శాకుంతల పాత్రలో సమంత లుక్‌ అదిరింది. ఇక మేకింగ్‌ పరంగా గుణశేఖర్‌ తరహా భారీతనం కనిపిస్తోంది. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌, గౌతమి, మధుబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నీలిమా గుణ నిర్మిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Untitled-2.jpg

Updated Date - 2023-01-09T14:23:17+05:30 IST