Shaakuntalam: ఓటీటీలో వచ్చేది అప్పుడే!

ABN , First Publish Date - 2023-05-06T16:58:24+05:30 IST

సమంత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత నెల 14న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది

Shaakuntalam: ఓటీటీలో వచ్చేది అప్పుడే!

సమంత (Samantha) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam) గుణ శేఖర్‌ (Gunasekhar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత నెల 14న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది. విజువల్‌ వండర్‌గా త్రీడీ ఫార్మెట్‌లో విడుదలైన ఈ చిత్రం అంచనాలను చేరుకోలేక పోయింది. తొలి ఆట నుంచి నెగటివ్‌ టాక్‌తో నిరుత్సాహపరచింది. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది. ఈ సినిమా అన్ని భాషల హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ కొనుగోలు చేసింది. ఈ నెల 12 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ర్టీమింగ్‌ కానుంది. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన శాకుంతలం ఓటీటీలో అయినా ప్రేక్షకాదరణ పొందుతుందేమో చూడాలి. (Mohanbabu)

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. టైటిల్‌ పాత్రలో సమంత, దేవ్‌ మోహన్‌ దుశ్యంతుడిగా నటించారు. నీలిమా గుణ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్‌ కింగ్‌ డా. మోహన్‌ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ నటించారు.

Updated Date - 2023-05-06T16:58:24+05:30 IST