Shaakuntalam: కొత్త తేది వచ్చింది.. ప్యాన్‌ ఇండియా పోటీలో పడింది!

ABN , First Publish Date - 2023-02-10T15:46:37+05:30 IST

అగ్ర కథానాయిక సమంత నటించిన ‘శాకుంతలం’ చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! గుణ శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు.

Shaakuntalam: కొత్త తేది వచ్చింది.. ప్యాన్‌ ఇండియా పోటీలో పడింది!

అగ్ర కథానాయిక సమంత నటించిన ‘శాకుంతలం’ (Shaakuntalam new Release date) చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! గుణ శేఖర్‌ (gunasekhar)దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్‌ను విడుదల (Shaakuntalam )చేసి వెల్లడించారు గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్‌’ రాజు 9Dil raju)నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ఇందులో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ (aalu arha)భరతుడి పాత్రలో కనిపించనుంది. మోహన్‌ బాబు, ప్రకాశ్‌ రాజ్‌, మధుబాల, గౌతమి, అదితి బాలన్‌, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సాంకేతికంగా హై ఉన్నతంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రీడీలోనూ విడుదల చేయబోతున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పటికేఆ తేదీలో పలు చిత్రాల విడుదల చేస్తునట్లు ప్రకటనలొచ్చాయి. అందులో చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్‌’ సినిమా కూడా ఉంది. రజనీకాంత్‌ ‘జైలర్‌’ చిత్రం కూడా రానుందని టాక్‌ వినిపిస్తోంది. ‘ఉగ్రం’, లారెన్స్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రుద్రుడు’ కూడా ఉన్నట్లు సమాచారం. మరి ఇన్ని సినిమాల పోటీలో గుణశేఖర్‌ ఈ తేదీనే ఎందుకు ఎంచుకున్నారనేది తెలియాలి. ఏది ఏమైనా సమంత అయితే ఈ చిత్రంపై ధీమాగా ఉన్నారు.

Updated Date - 2023-02-10T15:59:32+05:30 IST