Oscars: ‘ఆస్కార్’ అవార్డుల మోత మోగించిన Everything Everywhere All at Once సినిమా !

ABN , First Publish Date - 2023-03-13T12:37:23+05:30 IST

భారతీయ సినిమాలు 'ఆర్.ఆర్.ఆర్', 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అవార్డులు గెలుచుచుఁకోగా, ఇంకో సినిమా మాత్రం ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమా ఎదో తెలుసా...

Oscars: ‘ఆస్కార్’ అవార్డుల మోత మోగించిన Everything Everywhere All at Once సినిమా !

ఆస్కార్ అవార్డుల (Oscars95) సంబరాలు ఇక ముగిసినట్టే. ఈసారి ఆస్కార్ అవార్డులు ఉత్కంఠగా ఎదురుచూసిన వారిలో కొన్ని కోట్ల మంది భారతీయులు కూడా వున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాటకు ఆస్కార్ (OscarAwardForNaatuNaatu) అవార్డు లభించింది. దీనితో భారతీయ చలన చిత్ర పరిశ్రమకి చిరస్థాయిగా మిగిలిపోయిన రోజు ఈరోజు. అలాగే తెలుగు చలన చిత్రం ఆస్కార్ బరిలో నిలిచి అవార్డు గెలవటం తెలుగు వాడి వేడి చూపించిన సమయం ఇది. ప్రతి తెలుగు వాడూ గర్వించదగ్గ రోజు ఈ సంవత్సర ఆస్కార్ వేడుకలు. సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani), పాట రచయిత చంద్రబోస్ (Chandrabose) అవార్డును అందుకున్నారు. అలాగే ఇంకో భారతీయ సినిమా 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' (The Elephant of Whispers) కి కూడా అవార్డు రావటం భారతీయ ప్రజల సంతోషానికి అవధులు లేవు.

everythingeverywhereatonce1.jpg

అయితే ఈసారి ఎక్కువ అవార్డులు గెలిచిన సినిమా మాత్రం 'ఎవ్విరిథింగ్ ఎవ్విరి వేర్ అల్ యెట్ ఒన్స్' (Everything Everywhere All at Once). ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులు ఈసారి గెలుచుకుంది. బెస్ట్ పిక్చర్ తో పాటు ఇంకో ఆరు అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రానికి దర్శకులు డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్, ఈ కథ కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎవెలిన్ వాంగ్ అనే ఒక చైనీస్ అమెరికన్ మహిళ చుట్టూ కథ తిరుగుతుంది.

allquiteonthewesternfront.jpg

అలాగే 'అల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' నాలుగు అవార్డులు గెలుచుకోగా (All Quite on the Western Front), ఇంకో సినిమా 'ది వేల్' (The Whale) రెండు అవార్డులు గెలుచుకుంది. 'ఎవ్విరిథింగ్ ఎవ్విరి వేర్ అల్ యెట్ ఒన్స్' మొత్తం 11 నామినేషన్స్ లో ఉండగా ఏడూ అవార్డులు చేజిక్కుంచుకోవటం విశేషం.

ఇది కూడా చదవండి:

ది ఆస్కార్ అవార్డు గోజ్ టు 'నాటు నాటు'

Updated Date - 2023-03-13T13:06:57+05:30 IST