DasKaDhamki: విశ్వక్ సేన్ సినిమాకి షాకింగ్ ఓపెనింగ్స్

ABN , First Publish Date - 2023-03-23T13:14:03+05:30 IST

క్రిటిక్స్ కి విశ్వక్ సేన్ సినిమా 'దాస్ కి ధమ్కీ' నచ్చలేదు. డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ రేట్స్ చెప్పారని ఎవరూ ఈ సినిమాని తీసుకోవడానికి ముందుకు రాలేదు. అయినా నిరాశ పడకుండా తమ సినిమాని స్వంతగా పండగ నాడు విడుదల చేస్తే ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా....

DasKaDhamki: విశ్వక్ సేన్ సినిమాకి షాకింగ్ ఓపెనింగ్స్

యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) వైవిధ్యమయిన సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేస్తూ ఉంటాడు. ఇప్పుడు 'దాస్ క ధమ్కీ' (Das Ka Dhamki) సినిమాతో ఉగాది పండగ నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మామూలుగా అయితే సినిమాలు శుక్రవారం రోజు విడుదల అవుతాయి, కానీ పండగ రోజు సెలవు కావటంతో ఈ సినిమాని ఉగాది (Ugadi) రోజు విడుదల చేసాడు. అదీ కాకుండా ఈ సినిమాలో నటించడమే కాకుండా విశ్వక్ సేన్ నిర్మాత, దర్శకుడు కూడా.

vishwaksen2.jpg

ఈ సినిమాకి చాలా పెద్ద బడ్జెట్ పెట్టాడని కూడా పరిశ్రమలో టాక్ వినపడుతోంది. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు చాలా ఎక్కువ రేట్స్ చెప్పారని అందుకని ఎవరూ తీసుకుందుకు ముందుకు రాలేదని కూడా ఒక టాక్ నడుస్తోంది. దానితో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు (Karate Raju), ఈ సినిమాని తమ స్వంతంగానే చాలా డేరింగ్ గా విడుదల చేశారు.

అయితే సినిమా కూడా అంత బాగోలేదని క్రిటిక్స్ (Critics) అందరూ దీనికి రేటింగ్స్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. కానీ అందరినీ షాకింగ్ కి గురిచేస్తూ, ఈ సినిమా మొదటి రోజు అద్భుత ఓపెనింగ్స్ రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇదే బెస్ట్ ఓపెనింగ్స్ (Best opening) అని చెపుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు సుమారు రూపాయలు 8.8 కోట్ల గ్రాస్ (8.8 crore gross) రాబట్టింది, ఇది 50 శాతం రికవరీ (50 per cent recovery) మొదటి రోజే అయిపోయిందని అంటున్నారు. ఈరోజు కనగ అదే కలక్షన్స్ కంటిన్యూ అయితే ఈ సినిమా పెద్ద హిట్ దిశగా వెళుతుంది అనటం లో సందేహం లేదు.

vishwaksen1.jpg

నివేదా పెతురాజ్ (Nivetha Pethuraj) ఇందులో కథానాయిక కాగా, రావు రమేష్ (Rao Ramesh), హైపర్ ఆది (Hyper Aadi), జబర్దస్త్ మహేష్ (Jabardasth Mahesh) ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో సన్నివేశాలు యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేశాయని అంటున్నారు. అందువల్లే ఇది ఆడుతోందని కూడా టాక్ నడుస్తోంది. ఏమైనా కూడా విశ్వక్ సేన్ ఒక పెద్ద హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనటం లో సందేహం లేదు.

Updated Date - 2023-03-23T13:19:01+05:30 IST