Dasara: నాని సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్

ABN , First Publish Date - 2023-03-31T11:32:45+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.14 కోట్లకి పైగా వసూలు చేసిన నాని సినిమా 'దసరా' సెన్సేషనల్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి. ఇంతకు ముందు విడుదల అయిన నాని సినిమాలకి ఇది 50 శాతం ఎక్కువనే చెప్పాలి. నైజాం ఏరియాలో కూడా నాని తన సత్తా చాటాడు. ఏ ఏరియాలో ఎంత వచ్చింది అంటే...

Dasara: నాని సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్

నాని (Nani) 'దసరా' (Dasara) సినిమా ఓపెనింగ్స్ అయితే అనుకున్నట్టుగానే అద్భుతంగా వున్నాయి. నిన్న గురువారం శ్రీరామనవమి పండగ అవటంతో రెండు రాష్ట్రాల్లో సెలవు కావటం వలన, ఈ సినిమాకి బాగా లాభించింది. నాని ఈ సినిమాకి మునుపు ఎన్నడూ లేనంతగా ప్రచారం చెయ్యడం వలన ఈ సినిమా ప్రీ-రిలీజ్ బుకింగ్స్ బాగున్నాయి. అందుకని గురువారం విడుదల రోజు రెండు రాష్ట్రాల్లో సినిమా హౌస్ ఫుల్స్ తో నడిచింది.

మొదటి రోజు ఒక పెద్ద నటుడు సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ఆలా వచ్చాయి ఈ 'దసరా' సినిమాకి. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే నాని సునామి సృష్టించాడా అనేలా వున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి నటులతో సమానంగా నైజాం ఏరియా (Nizam area) లో మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు ఒక్క నైజాం ఏరియాలోనే రూ.6 కోట్లకు పైగా ఈ సినిమా చేసింది అంటే, నాని పవర్ ఏంటో తెలుస్తోంది. అలాగే ఆంధ్ర ఏరియా తో కలుపుకొని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు రూ.14 కోట్లకు పైగా వసూలు చేసింది.

dasara-nani.jpg

ఈమధ్య కాలం లో ఇలా ఓపెనింగ్స్ రాబట్టే సినిమా ఏదైనా వుంది అంటే, అది నాని సినిమా 'దసరా' అనే చెప్పొచ్చు. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా నాని తన సత్తా ఏంటో చూపించాడు. అక్కడ చిరంజీవి (Mega Star Chiranjeevi) 'వాల్తేర్ వీరయ్య' (Waltair Veerayya), బాలకృష్ణ (Nandamuri Balakrishna) 'వీరసింహారెడ్డి' (Veerasimha Reddy) తరువాత నాని 'దసరా' (Dasara) మూడో స్థానంలో నిలిచింది. ఇవి ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలు. మరోసారి తెలుగు సినిమా హవా ఏంటో చూపించాడు నాని తన 'దసరా' సినిమాతో. అయితే ఈ సినిమా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా కలెక్షన్స్ వుంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-31T11:32:46+05:30 IST