సీనియర్ ఎడిటర్ జి.జి. కృష్ణారావు కన్నుమూత
ABN , First Publish Date - 2023-02-22T00:32:54+05:30 IST
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస మరణాలు విషాదంలో ముంచుతున్నాయి. హీరో నందమూరి తారకరత్న కన్నుమూసి రెండు రోజులు అయిందో లేదో మంగళవారం మరో చిత్ర ప్రముఖుడు, సీనియర్ ఎడిటర్ జి..జి. కృష్ణారావు బెంగళూరులో తుది శ్వాస విడిచారు....
తెలుగు చిత్ర పరిశ్రమను వరుస మరణాలు విషాదంలో ముంచుతున్నాయి. హీరో నందమూరి తారకరత్న కన్నుమూసి రెండు రోజులు అయిందో లేదో మంగళవారం మరో చిత్ర ప్రముఖుడు, సీనియర్ ఎడిటర్ జి..జి. కృష్ణారావు బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకులందరి దగ్గర కృష్ణారావు ఎడిటర్‌గా పనిచేశారు. దాదాపు 200 చిత్రాలకు ఆయన ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకుల చిత్రాలకు పని చేశారు. దాసరి దర్శకత్వం వహించిన ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ చిత్రాలకు, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘శుభలేఖ’, ‘స్వాతిముత్యం’ సహా విశ్వనాథ్ రూపొందించిన దాదాపు అన్ని చిత్రాలకు కృష్ణారావు పని చేశారు. ఆయన మృతికి ఎడిటర్స్ అసోసియేషన్ సంతాపం వెలిబుచ్చింది.