Sarkaru Naukari : సింగర్‌ సునీత తనయుడు హీరోగా...

ABN , First Publish Date - 2023-01-26T16:16:50+05:30 IST

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్‌.కె టెలీ షో ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై గంగనమోని శేఖర్‌ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.

Sarkaru Naukari : సింగర్‌ సునీత తనయుడు హీరోగా...

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K raghavendrarao) నిర్మాతగా ఆర్‌.కె టెలీ షో (Rk tele show)ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై గంగనమోని శేఖర్‌ దర్శకత్వంలో ‘సర్కారు నౌకరి’ (sarkaru noukari)చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. గాయని సునీత తనయుడు ఆకాష్‌ (akash), (sunitha son) హీరోగా, నూతన నటి భావనా వళపండల్‌ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత ప్రసాద్‌ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్‌ చేయగా, గాయని సునీత, ఆమె భర్త రామ్‌ గౌరవ దర్వకత్వం వహించారు. ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుగుతుందని చిత్ర బృందం తెలిపారు. ఈ చిత్రానికి సంగీతంఫ శాండిల్యా, ఆర్ట్‌ : రవి.

Updated Date - 2023-01-26T17:01:45+05:30 IST