Sarath Babu Health: బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ ఎఐజీకి తరలింపు!

ABN , First Publish Date - 2023-04-22T12:04:10+05:30 IST

ఇటీవల అస్వస్థతకు గురైన సీనియర్‌ నటుడు శరత్‌బాబు బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! చికిత్స పొందుతున్న ఆయన కొంతవరకూ కోలుకున్నారని సన్నిహితులు వెల్లడించారు.

Sarath Babu Health: బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ ఎఐజీకి తరలింపు!

ఇటీవల అస్వస్థతకు గురైన సీనియర్‌ నటుడు శరత్‌బాబు (Sarathbabu) బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! చికిత్స పొందుతున్న ఆయన కొంతవరకూ కోలుకున్నారని సన్నిహితులు వెల్లడించారు. శుక్రవారం శరత్‌బాబు ఆరోగ్యం (Sarathbabu in AIG hospital) మరోసారి అస్వస్థతకు గురి కావడంతో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. శనివారం ఐసీయు నుంచి రూమ్‌కి షిప్ట్‌ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. (Sarathbabu hospitalized)

1973లో విడుదలైన ‘రామరాజ్యం’ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ , మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు250కి పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు వరించాయి.

Updated Date - 2023-04-22T12:04:58+05:30 IST