SarathBabu: చివరి వేషం సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో

ABN , First Publish Date - 2023-05-22T15:44:27+05:30 IST

సుమారు రెండు వందలకు పైగా దక్షిణాది భాషలు అన్నిటిలో సినిమాలు చేసిన నటుడు శరత్ బాబు. అందరి పెద్ద స్టార్స్ తో అంటే ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీగణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, కృష్ణ, కృష్ణం రాజు అందరితో కూడా సినిమాలు చేసి పోటీగా నటించేవాడు శరత్ బాబు. అతని ఆఖరి సినిమా నరేష్, పవిత్ర నటించిన 'మళ్ళీ పెళ్లి' చిత్రం లో కృష్ణ గారి పాత్ర వేసాడు. ఈ వారం ఈ సినిమా విడుదల అవుతోంది.

SarathBabu: చివరి వేషం సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో
Jayasudha and Sarath Babu from Malli Pelli

శరత్ బాబు #RIPSarathBabu చాలా పొడుగ్గా వున్న నటుల్లో ఒకరు. #SarathBabu అంత పొడుగ్గా, ఎర్రగా ఒక వైవిధ్యంగా కనిపించి అందరినీ ఇట్టే ఆకర్షించే గుణం వున్న నటుడు శరత్ బాబు. మొదట్లో ఎన్నో కష్టాలు పడినా, ఎదుర్కొని ఆ తరువాత సెటిల్ అయినా మనిషి. "నాకు నలభై నాలుగు సంవత్సరాలు నుండి పరిచయం వుంది శరత్ బాబుతో. నేను అతనితో సినిమా చెయ్యలేదు కానీ, ఒకసారి నేను 'చిన్ననాటి కలలు' సినిమా చేస్తుండగా అక్కడే షూటింగ్ చేస్తున్న రమాప్రభ నాకు శరత్ బాబు ని పరిచయం చేసింది," అని చెప్పారు, ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (ThammareddyBharadwaj).

చాలా మంచి మనిషి, అక్కడ నుండి ఇద్దరం ఎప్పుడూ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం, హాస్పిటల్ లో జాయిన్ అవ్వక ముందు కూడా మాట్లాడేడు నాతో, అని చెప్పారు తమ్మారెడ్డి. ఎక్కువగా ఎవరితో మాట్లాడాడు, తన పని తాను చూసుకునే మనస్తత్వం వుండే మనిషి. ఆమధ్య చిరంజీవి పరిశ్రమలోని ఎంప్లాయిస్ కోసం సిసిసి ని స్టార్ట్ చేసినప్పుడు తనే నాకు ఫోన్ చేసి, విరాళాలు ఎక్కడ ఎవరికీ ఇవ్వాలి అన్న డీటెయిల్స్ అడిగితే నేను ఇచ్చాను. అతను ఆ ఫండ్ కి డొనేట్ కూడా చేసాడు. అలాగే రసీదు కూడా అడిగి పుచుకున్నాడు.

sarathbabu2.jpg

అతను చాలా కామ్ గా ఉంటాడు, ఎవరి గురించి అక్కరలేదు, ఎవరి గురించీ కూడా మాట్లాడాడు. అన్నిటికీ మించి ఒక మంచి నటుడు, చాలామంది స్టార్స్ ఎన్టీఆర్, నాగేశ్వర రావు, రజినీకాంత్, కమల్ హాసన్, శివాజీగణేశన్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి నటులు అందరితో పోటీపడి నటించేవాడు. అలంటి ఒక మంచి వ్యక్తి, నటుడు మన మధ్యలో లేకుండా అనంత లోకాలకు వెళ్ళిపోవటం చాలా విచారకరం. అతని ఆత్మకి ఆ భగవతుండు శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాను, అని చెప్పారు తమ్మారెడ్డి.

శరత్ బాబు చివరి పాత్ర ఏ సినిమాలో వేసారో తెలుసా? నరేష్ (VKNaresh), పవిత్ర లోకేష్ (PavitraLokesh) నటించిన 'మళ్ళీ పెళ్లి' #MalliPelli చిత్రంలో. దీనికి ఎంఎస్ రాజు (MSRaju) దర్శకుడు, ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) పాత్రలో శరత్ బాబు కనిపించనున్నాడని తెలిసింది.

Updated Date - 2023-05-22T15:44:27+05:30 IST