Sarath Babu: శరత్ బాబు మరణ వార్తలపై ఎలా స్పందించారంటే...

ABN , First Publish Date - 2023-05-04T10:52:44+05:30 IST

సీనియర్‌ నటుడు శరత్‌బాబు (Saratbabu) మరణించారని వస్తున్న వార్తలను తన సోదరి (Saratbbai sister) ఖండించారు. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు .

Sarath Babu: శరత్ బాబు మరణ వార్తలపై ఎలా స్పందించారంటే...

సీనియర్‌ నటుడు శరత్‌బాబు (Sarath Babu) మరణించారని వస్తున్న వార్తలను తన సోదరి (Sarath Babu sister) ఖండించారు. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు . బెంగుళూరులో చికిత్స అనంతరం ఆయన్ను హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆయన మరణించారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో వార్తలు రావడం, కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ పోస్ట్‌లు చేయడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. దీనిపై శరత్‌బాబు సోదరి స్పందించారు(Sarath Babu hospitalized). ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని, ఇటీవల ఐసీయూ నుంచి రూమ్‌కి షిఫ్ట్‌ చేశారని ఆమె తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్నయ్య పూర్తిగా కోలుకుని మీడియా ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శరత్‌బాబు మరణించలేదని ఆయన సోదరుడు వెల్లడించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందుతుందని చెప్పారు. (Sarababu is alive)

ఇదే విషయంపై నటుడు కాదంబరి కిరణ్‌ స్సందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ప్రియతమ నటుడు శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు చికిత్స అందుతుంది. కానీ కొందరు ఆయన చనిపోయారనే వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన చర్య. మీరు, నేను, మనందరం ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ చనిపోకముందు చనిపోయారని రాయడం చాలా తప్పు. శరత్‌బాబు బతికే ఉన్నారని చెప్పండి. గతంలో అక్కినేని నాగేశ్వరరావు, వేణుమాధవ్‌, కోట శ్రీనివాసరావు, ఏవీఎస్‌ ఇలా చాలామంది విషయంలో ఇలాంటి వార్తలు ప్రచారం అయ్యాయి. దయచేసి మనిషి బతికుండగానే చంపేయొద్దు’’ అని వీడియోలో పేర్కొన్నారు.

Updated Date - 2023-05-04T12:17:05+05:30 IST