Sarath Babu: పరిస్థితి విషమం.. కొన్ని గంటలు గడిస్తే తప్ప..!

ABN , First Publish Date - 2023-04-23T15:26:39+05:30 IST

సీనియర్‌ నటుడు శరత్‌ బాబు(72) (Sarathbabu) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Sarath Babu: పరిస్థితి విషమం.. కొన్ని గంటలు గడిస్తే తప్ప..!

సీనియర్‌ నటుడు శరత్‌ బాబు(72) (Sarathbabu) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజుల క్రితం ఆయనను బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో (Sarath babu in ICU) ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడంతో కీలక అవయవాలైన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్స్‌ వెల్లడించినట్లు తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నేటి సాయంత్రం ఏఐజీ ఆస్పత్రి నుంచి హెల్త్‌ బులెటిన్‌ వచ్చే అవకాశం ఉంది. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన శరత్‌బాబు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అలరించారు. మూడు నంది పురస్కారాలను అందుకున్నారు. (Sarathbabu Condition critical)

Updated Date - 2023-04-23T15:26:39+05:30 IST