Virupaksha: దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సంయుక్త

ABN , First Publish Date - 2023-04-20T18:22:22+05:30 IST

ఏ అమ్మాయికి అయినా ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ అనటం అనే కాన్సెప్ట్ అనేది చాలా తప్పు అని చాలా సీరియస్ గా చెప్పింది సంయుక్త. ఒక సినిమాలో ఎవరినైనా తీసుకుందెయ్ ఆమె ప్రతిభ, లేదా ఆ పాత్రకి ఆమె న్యాయం చేస్తుంది అనుకుంటే తప్ప, అంతే కానీ....

Virupaksha: దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సంయుక్త

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన 'విరూపాక్ష' (Virupaksha) సినిమా రేపు శుక్రవారం విడుదల అవుతోంది. మొదట ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, టైము సరిపోకపోవటంతో ఒక్క తెలుగులోనే విడుదల అవుతోంది అని చెప్పాడు ఈ సినిమా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. అయితే ఇందులో కథానాయకురాలిగా చేసిన సంయుక్త (Samyuktha Menon)ని 'గోల్డెన్ లెగ్' (Golden Leg) అని అనటం, ఆ తరువాత అందువల్లనే మీరు ఈ సినిమాలో ఈ పాత్రని దక్కించుకున్నారా అని అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది సంయుక్త.

samyukthamenon3.jpg

అసలు ఆ గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ (Iron Leg) కాన్సెప్ట్ అనేదే చాలా బాడ్ అని చెప్పింది. "ఒక అమ్మాయి లక్కీ అని ఆమెని సినిమాలోకి ఒక పాత్రని ఎంపిక చెయ్యడం అనే కాన్సెప్ట్ నేను నమ్మను. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము, అలాగే మా ప్రయత్నాలు మేము చేస్తాము, అందువల్ల మాకు సక్సెస్ వస్తుంది. అంతే కానీ ఆమె గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ ఈ కాన్సెప్ట్ అసలు ఎప్పుడూ వర్క్ అవుట్ కాదు," అని చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.

samyukthamenon2.jpg

"ఒక స్క్రిప్ట్ కి, లేదా ఒక పాత్రకి ఒక అమ్మాయి న్యాయం చేస్తుంది అంటే ఆమెని ఆ సినిమాలోకి తీసుకుంటారు. అలాగే ఆమె ప్రతిభ మీద చాలా ఆధారపడి ఉంటుంది, అంతే కానీ కేవలం లక్కీ అని తీసుకోవటం అనేది జరగదు. దీన్ని వదిలేద్దాం ఎందుకంటే ఇది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, ఇది చాలా ఏళ్ల కిందట అనుకునే మాటలు", అని సంయుక్త చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. మరి అడిగిన అతనికి ఆమె మాటలు అర్థం అయ్యాయో లేదో!

samyukthamenon1.jpg

మలయాళం నటి అయిన సంయుక్త తెలుగులో పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన 'భీమ్లా నాయక్' (BheemlaNayak) తో ఎంట్రీ ఇచ్చింది, తరువాత 'బింబిసార' (Bimbisara) సినిమాతో ఇంకో హిట్ కొట్టింది. ఈమధ్య విడుదల అయిన 'సర్' (Sir) సినిమాలో ధనుష్ (Dhanush) పక్కన చేసి మంచి పేరు తెచ్చుకుంది, అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు 'విరూపాక్ష' (Virupaksha) సినిమా విడుదల అవుతోంది.

Updated Date - 2023-04-20T18:22:22+05:30 IST