Samantha: టర్కీలో సామ్‌ ఎంజాయ్‌.. ఫొటోలు వైరల్‌!

ABN , First Publish Date - 2023-06-06T14:09:23+05:30 IST

షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే సినీ సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోతారు. సరదాగా సేద తీరుతుంటారు. తాజాగా ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లిన సమంత కూడా అదే పనిలో ఉన్నారు. టర్కీలో ఉన్న సామ్‌ అక్కడి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Samantha: టర్కీలో సామ్‌ ఎంజాయ్‌.. ఫొటోలు వైరల్‌!

షూటింగ్‌ గ్యాప్‌ దొరికితే సినీ సెలబ్రిటీలు విదేశాల్లో వాలిపోతారు. సరదాగా సేద తీరుతుంటారు. తాజాగా ‘ఖుషి’ (Kushi) సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లిన సమంత (Samantha) కూడా అదే పనిలో ఉన్నారు. టర్కీలో ఉన్న సామ్‌ అక్కడి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తన గదిలో చిల్‌ అవుతూనే రూమ్‌ నుంచి బీచ్‌ లోకేషన్‌, పీస్‌ ఫుల్‌ క్టైమేట్‌కు సంబంధించిన ఫొటోలూ షేర్‌ చేసింది. మరో ఫొటోలో బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో(Photos viral), బ్లాక్‌ గాగుల్స్‌తో స్టైలిష్‌గా కనిపించింది. కార్‌లో వెళ్తూ తనకు నచ్చిన బుక్స్‌ చదువుతోంది. ‘‘టర్కీలో ది బెస్ట్‌ డేస్‌’ (the best days in Turkey) అనే కామెంట్‌ను జోడించింది. ప్రస్తుతం సమంత పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నాలుగు నెలల కిందట వరకూ మాయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధ పడ్డ ఆమె ప్రస్తుతం కోలుకుని సినిమాలతో బిజీ అయింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ టర్కీలో జరుగుతోంది. అక్కడ విజయ్‌, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు రాజ్‌- డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌కు జోడీగా సామ్‌ నటిస్తోంది. ఇది పక్కా యాక్షన్‌ సిరీస్‌ కావడంతో సమంత స్పెషల్‌ కేర్‌ తీసుకుంటోందట.

Updated Date - 2023-06-06T14:09:23+05:30 IST