Samantha : ఆ విషయం విజయ్‌కు చెప్పేస్తా...

ABN , First Publish Date - 2023-09-03T17:08:37+05:30 IST

అగ్ర తార సమంత (Samantha) నటించిన తాజా చిత్రం ‘ఖుషి’(Kushi). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం అందుకొంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో అయితే 1 మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లోకి అడుగుపెట్టింది.

Samantha : ఆ విషయం విజయ్‌కు చెప్పేస్తా...

అగ్ర తార సమంత (Samantha) నటించిన తాజా చిత్రం ‘ఖుషి’(Kushi). శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం అందుకొంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. అమెరికాలో అయితే 1 మిలియన్‌ డాలర్‌ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. దీనిపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె.. అక్కడి వారిని, అభిమానులను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. (Samantha thanks to USA Fans)

సమంత మాట్లాడుతూ ‘ఖుషి’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా అమెరికాలో ఉన్న అభిమానులు, సినీ ప్రేమికుల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. దీనిని నేను నమ్మలేకపోతున్నా. అమెరికాలోనే నా కెరీర్‌ ప్రారంభమైంది. నా కెరీర్‌ ఎదుగుదలతో భాగమైన ఇక్కడి వారిని కలవడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. ఇప్పటివరకూ నేను నటించిన 16 చిత్రాలు 1 మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించాయి. ‘ఖుషి’తో ఆ సంఖ్య 17కు చేరింది. అందుకు ఎంతో గర్విస్తున్నా. మీరు నాపై చూపిస్తోన్న అమితమైన ప్రేమకు థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నది. గత నెల రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్నా. ‘ఖుషి’ సినిమాపై మీరు చూపిస్తోన్న ప్రేమ గురించి విజయ్‌తో చెబుతా. మీ అందరికీ ఆయనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఇంటికి దూరంగా కొన్ని వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినప్పటికీ.. ఇక్కడ ఉంటే నా ఇంట్లోనే ఉన్న భావన కలుగుతుంది’’ అని ఆమె అన్నారు. విజయ్‌ దేవరకొండ - సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-09-03T17:13:48+05:30 IST