Samantha: గుడి కట్టిన అభిమానికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలుసా?

ABN , First Publish Date - 2023-04-29T14:41:42+05:30 IST

అభిమాన తారలు కోసం అభిమానులు ఎన్నెన్నో చేస్తుంటారు. సేవా (Samantha temple) కార్యక్రమాలు, అన్నదానాలు, రక్త్తదానాలు ఇలా చాలానే ఉంటాయి. అభిమానం ఇంకా శ్రుతిమించితే దేవుళ్లుగా భావించి ఆరాధిస్తుంటారు.

Samantha: గుడి కట్టిన అభిమానికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలుసా?

అభిమాన తారలు కోసం అభిమానులు ఎన్నెన్నో చేస్తుంటారు. సేవా (Samantha temple) కార్యక్రమాలు, అన్నదానాలు, రక్త్తదానాలు ఇలా చాలానే ఉంటాయి. అభిమానం ఇంకా శ్రుతిమించితే దేవుళ్లుగా భావించి ఆరాధిస్తుంటారు. గుళ్లూ కట్టేస్తుంటారు. ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌, కుష్బూ, నమిత, నిధీ అగర్వాల్‌లకు తమ అభిమానులు గుళ్లు కట్టేశారు. అవన్నీ తమిళనాడు తదితర పాంత్రాల్లో. తెలుగునాట కూడా ఇలాంటి ఓ ప్రయత్నం జరిగింది. ఓ అభిమాని సమంతకు (Samantha temple) గుడి కట్టాడు. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ గుడిలో విగ్రహాన్ని పెట్టి ప్రారంభించాడు. గుంటూరులోని బాపట్లలో ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్‌ (sandeep built temple for samantha) సమంతకు గుడి కట్టారు. కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశాడు. గ్రామస్థులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ తంతు అంతా బాగానే ఉంది కానీ ఇంత చేసిన సందీప్‌పై విపరీతంగా ట్రోలింగ్‌ జరుగుతోంది.

456+.jpg

సందీప్‌ కట్టించిన గుడిలో పెట్టిన సమంత బొమ్మ అసలు సమంతలానే లేదని నెటిజన్లు అతన్ని ఆడేసుకుంటున్నారు. సమంతను అభిమానించేవారు కొందరు సందీప్‌ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ ‘బావుందన్నా... నిజంగా బావుంది’ అని కామెంట్స్‌ చేస్తుంటే ‘అక్కడ సమంత ఎక్కడుంది సార్‌.. సమంత లేదు కదా మరి టెంపుల్‌ ఏంటి?’ అని అంటూ మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. సామ్‌ మీద అభిమానంతో గుడి కట్టించాలనుకోవడం తప్పు కాదు కానీ సమంత రూపాన్ని కరెక్ట్‌గా చెక్కే శిల్పిని ఎంచుకుని ఉంటే బావుండేది’ అని సలహా ఇస్తున్నారు. ఆ ట్రోల్‌పై మీరు ఓ లుక్కేయండి! Trolls on Samantha fan Sandeep).

‘‘సమంత నటనకు, అమె చేస్త్తున్న సేవా కార్యక్రమాలకు నేను అభిమానిని. చిన్న పిల్లలకు సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆమె కోసం ఏదొకటి చేయాలనిపించింది. అందుకే మా ఇంటి ప్రాంగణంలోనే సమంతకు గుడిలా కట్టి విగ్రహం పెట్టాను. ప్రతి ఏటా ఆమె పుట్టినరోజున అన్నదానం చేస్తాను’’ అని సందీప్‌ చెప్పారు.

ప్రస్తుతం సమంత లండన్‌లో ఉన్నారు. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కోసం రూపొందుతున్న ‘సిటాడెల్‌’ సిరీస్‌ షూటింగ్‌లో ఉన్నారు. పుట్టినరోజున కూడా లీవ్‌ తీసుకోకుండా ఆమె ఆ సిరీస్‌లో నిమగ్నమయ్యారు.

Updated Date - 2023-04-29T16:04:05+05:30 IST