సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha Reaction: ఆ మూడు దూరం పెంచుతాయి!

ABN, First Publish Date - 2023-05-06T12:56:17+05:30

సమంత (samantha) - నాగచైతన్య (naga chaitanya) విడిపోయి రెండేళ్లు కావొస్తుంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాది పూర్తయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత (samantha) - నాగచైతన్య (naga chaitanya) విడిపోయి రెండేళ్లు కావొస్తుంది. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని ఏడాది పూర్తయింది. ఈ రెండేళ్లల్లో సమంత గానీ, నాగచైతన్య గానీ విడాకులు గురించి, దానికి గల కారణాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నారు. తొలిసారి నాగచైతన్య ఈ విషయంపై పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. Samantha reaction)

‘‘జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని నేను గౌరవిస్తాను. సమంత మంచి వ్యక్తి. తను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతులే మా ఇద్దరి మధ్య పరిస్థితులను తారుమారు చేశాయి. ఒకరిపై ఒకరకి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది’’ అని ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనికి స్పందనగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, కొన్ని నమ్మకాలు, భయాలు మనల్ని దూరం చేస్తాయి’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో కొటేషన్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చై-సామ్‌ అభిమానులు వీరిద్దరూ కలిసుండాలని మొదటి నుంచీ కోరుకుంటున్నారు. తాజా కామెంట్‌తో కొందరు సపోర్ట్‌గా మాట్లాడుతుంటే మరికొందరు వీరిద్దరూ ఈగో కారణంగా విడిపోయారా? అని చెవులు కొరుక్కుంటున్నారు.

నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 12న విడుదల కానుంది. వెంకట ప్రభు దర్శకత్వం వహించిన చిత్రమిది. సమంత ఇటీవల విడుదలైన ‘శాకుంతలం’ చిత్రంతో పరాజయాన్ని చవిచూసింది. తదుపరి ఆమె నటించిన ‘ఖుషి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో ‘సిటాడెట్‌’ సిరీస్‌లో నటిస్తోంది.

Updated Date - 2023-05-06T12:56:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!