Samantha: ఇంట్లో కూర్చో చాలు, నీకు ఐటెం సాంగ్ ఎందుకు అన్నారు

ABN , First Publish Date - 2023-03-29T14:25:55+05:30 IST

మొదటి సారిగా సమంత తన విడాకుల గురించి, వ్యక్తిగత జీవితం గురించి నోరు విప్పింది. దగ్గరి బంధువులు, స్నేహితులు విడాకుల సమయంలో ఎలాంటి సలహాలు ఇచ్చారు, వాటిని ఆమె స్వీకరించిందా లేదా అనే విషయం మీదా కూడా మాట్లాడింది

Samantha: ఇంట్లో కూర్చో చాలు, నీకు ఐటెం సాంగ్ ఎందుకు అన్నారు

సమంత, (Samantha) నాగ చైతన్య (Naga Chaitanya) ఇద్దరూ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో వున్నారు. ఒక పక్క నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తో డిన్నర్ లో, లంచ్ చేస్తూ కనపడుతూ ఉంటే, ఇంకో పక్క సమంత తన రాబోయే సినిమా 'శాకుంతలం' (Shaakuntalam) ప్రచార చిత్రాల్లో భాగంగా తన వివాహం విడిపోవటం గురించి మొదటి సారిగా బయటకి చెపుతోంది. అలాగే తన మయోసిటిస్ వ్యాధి, అప్పుడు తాను ఎలా కష్ఠాలు ఎదుర్కొంది, తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చెపుతోంది.

సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కొందరు సమంతని, (Samantha speaks about her divorce) కొందరు చైతన్యని తప్పుగా చూపించారు. ఎవరిదీ తప్పు అయినా, కాకపోయినా, ఇద్దరూ విడిపోయారు, కానీ సెలబ్రిటీస్ అవటంతో, ఎందుకు విడిపోయారు అన్న విషయమే ఎక్కువమందికి ఆసక్తికర ప్రశ్నగా మిగిలిపోయింది. నాగ చైతన్య విడిపోవటం గురించి మాట్లాడలేదు, కానీ ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు సమంత మాట్లాడుతోంది. ఆమె తాను నూటికి నూరు శాతం నిజాయితీగా వివాహం అయ్యాక ఉన్నట్టు చెపుతోంది. ఎంత నిజాయితీగా వున్నా అది సరిగ్గా కుదరలేదు అని చెప్పింది సమంత.

samantharuthprabhu5.jpg

విడాకులు తీసుకున్నాక వచ్చిన మొదటి ఆఫర్ 'పుష్ప' (Pushpa) సినిమాలో 'వూ అంటావా..' (oo antava) ఐటెం సాంగ్ (Item Song). అయితే నేను తప్పు చెయ్యలేదు అని నాకు తెలుసు, అందుకు నేను ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, వెంటనే ఈ సాంగ్ ఒప్పుకున్నాను అని చెప్తోంది సమంత. "నాకు చాలా దగ్గరివాళ్ళు, నా స్నేహితులు కూడా విడాకులు తీసుకున్న వెంటనే ఎలా వొప్పుకుంటావ్ ఈ ఐటెం సాంగ్, సినిమాలు వద్దు ఏమీ వద్దు, ఇంట్లో కూర్చో అని చెప్పారు," అని అంటోంది సమంత. ఆమె వాళ్ళందరూ చెప్పిన మాట వినకుండా ధైర్యంగా బయటకి వచ్చి ఆ సాంగ్ చెయ్యాలనే డిసైడ్ అయ్యింది.

samantharuthprabhu1.jpg

అలాగే ఆమె ఈ మయోసిటిస్ (Myositis) వ్యాధితో చాలా నెలల పాటు బాధ పడింది. అందుకోసం ఎంతో శ్రమ పడింది, మెడికేషన్ కూడా తీసుకుంది. అలాంటప్పుడు కొన్ని రోజులు నీరసంగా ఉంటుంది కూడా. అందుకే కొన్ని సార్లు లావుగా, కొన్నిసార్లు సన్నగా రకరకాలుగా కనపడింది. అదీ కాకుండా కళ్ళకు వెలుతురు పడదు, అందుకని కళ్ళజోడు పెట్టుకొని బయటకి వచ్చింది. దానికి కూడా ఏవేవో అన్నారు, స్టైల్ మార్చింది అని, ఇంకేదో అని, కానీ నిజం తనకి తెలుసు కాబట్టి ఎవరు ఏ కామెంట్ చేసినా పట్టించుకోవటం మానేసాను అని చెప్తోంది సమంత.

Updated Date - 2023-03-29T18:23:13+05:30 IST