Samantha: సమంత పని అయిపొయింది అనేవాళ్ళకి ఇది సమాధానమా ?

ABN , First Publish Date - 2023-04-19T14:39:05+05:30 IST

నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి ఈమధ్య చాల చానెల్స్ తో మాట్లాడుతూ సమంతని బాగా విమర్శించాడు. ఆమె చేస్తున్నది అంతా పబ్లిసిటీ అని, ఆమె అందం తగ్గిపోయిందని, ఆమె ఇంక కథానాయకురాలిగా పనికిరాదని చెప్పాడు. కానీ ఇప్పుడు సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫోటోస్ చూస్తుంటే మాత్రం...

Samantha: సమంత పని అయిపొయింది అనేవాళ్ళకి ఇది సమాధానమా ?
Samantha with the 'Citadel' directors Raj and DK, actor Varun Dhawan

ఈమధ్య విడుదల అయిన 'శాకుంతలం' (Shakuntalam) సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అసలు మొదటి షో నుండి ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు కనీసం చూడటానికి ఆసక్తి చూపలేదు. ఇంత ప్లాప్ అవుతుందని ఎవరూ అనుకోలేదు, ఇది సమంత కి, దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కి చాలా పెద్ద దెబ్బ.

అయితే నిర్మాత, నటుడు అయిన త్రిపురనేని చిట్టి (Tripuraneni Chitti) సమంత ని చాలా తీవ్రంగా విమర్శించాడు. అనేక చానెల్స్ లో అతను ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో సమంత శకుంతల పాత్రకు సరిపోదని మొదట చెప్పాను అని, తను చెప్పినట్టుగానే సినిమాలో ఆమె పాత్ర బాగోలేదని, అందుకే సినిమా ప్లాప్ అయిందని చెప్పాడు.

samantha-citadel.jpg

ఇంకా అతను సమంత ఈ సినిమా విడుదల కి ముందు తనకి వచ్చిన వ్యాధి గురించి, తను సెలైన్ బాటిల్ పెట్టుకొని ఎలా డబ్బింగ్ చెప్పాను అన్న విషయాలు సాంఘీక మాధ్యమాల్లో పెట్టింది, అలాగే సినిమా ప్రచారం లో భాగంగా చెప్పింది కూడా. దీన్ని కూడా చిట్టి తప్పు పట్టాడు. ఇంతకు ఎంతోమంది నటీనటులు హై ఫీవర్ తో షూటింగ్ కూడా చేసారని, సమంత చేసింది కేవలం పబ్లిసిటీ మాత్రమే అని అంటున్నాడు.

samantha-citadel1.jpg

అలాగే సమంత పని అయిపోయిందని, ఆమె కథానాయకురాలిగా పనికి రాదనీ, అందుకే పెద్ద నటుల పక్కన ఆమెని తీసుకోవటం లేదని, ఆమె ఇక కేవలం ఆమె ప్రధాన పాత్రలో వుండే సినిమాలే చేసుకోవాలని చెప్పాడు. సమంత 'ఖుషి' (Khushi) అనే సినిమా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో చేస్తోంది. ఇంకా 'సిటాడెల్' (Citadel) అనే వెబ్ సిరీస్ కూడా వుంది. ఇవి కాకుండా కొత్త సినిమాలు ఏమైనా వొప్పుకుందేమో చూడాలి.

samantha-citadel2.jpg

ఇవన్నీ ఇలా ఉంటే, సమంత ఇప్పుడు లండన్ లో వుంది. ఆమె, దర్శకులు రాజ్ డీకే (Raj&DK) లతో లండన్ (London) లో వున్న ఫోటో నిన్నటివరకు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదీ కాకుండా ఇప్పుడు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel) ప్రీమియర్ కి తయారయి వెళుతూ తన ఫోటోస్ పోస్ట్ చేసింది. ఇందులో సమంత చాలా బాగుంది. మొన్నటివరకు ఆ కళ్లద్దాలు పెట్టుకొని, 'శాకుంతలం' సినిమాకి ప్రచారాలు నిర్వహించిన సమంత, ఇక్కడ ప్రీమియర్ కి హాజరు అయిన సమంతని చూస్తే ఏంటి ఇంత తేడా అనేట్టు వుంది.

Updated Date - 2023-04-19T14:39:06+05:30 IST