Samantha: లుక్ అదిరింది.. స్టూడెంటా... సాఫ్ట్‌వేరా?

ABN , First Publish Date - 2023-04-28T19:44:38+05:30 IST

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Samantha: లుక్ అదిరింది.. స్టూడెంటా... సాఫ్ట్‌వేరా?

సమంత(samantha), విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’(Kushi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. శుక్రవారం హీరోయిన్‌ సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతు కొత్త లుక్‌ను విడుదల చేశారు. చుడిదార్‌ ధరించి మెడలో ఐడీ కార్డ్‌ వేసుకుని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిలా కనిపిస్తున్న సామ్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఆమె లుక్‌ చూస్తుంటే ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ లుక్‌ చేసిన అందరూ సామ్‌ ఈ చిత్రంలో స్టూడెంటా? లేక సాఫ్ట్‌వేర్‌ మహిళనా? అని కామెంట్లు చేస్తున్నారు. (Happy birthday Samantha)

అయితే ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. మధ్యలో సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడడంతో షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న అనంతరం సామ్‌ సెట్‌లో అడుగుపెట్టారు. త్వరలో షూటింగ్‌ పూర్తి చేసి సెప్టెంబర్‌ 1న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌ దేవరకొండకు ‘లైగర్‌’, సమంతకు ‘శాకుంతలం’ చిత్రాలు పరాజయం కావడంతో ‘ఖుషి’ చిత్రం మీదే వీరిద్దరూ ఆశలు పెట్టుకున్నారు.

సామ్‌కు శుభాకాంక్షల వెల్లువ... (Ramcharan)

నేడు సమంత పుట్టనరోజు కావడంతో సినీ సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షల వర్షం కురిపించారు. సోషల్‌మీడియా వేదికగా రామ్‌చరణ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మైత్రీ సంస్థ కొత్త లుక్‌ పోస్టర్‌ షేర్‌ చేసి ‘మీరు ఆనందంగా ఉండండి. మీ చుట్టూ ఉన్నవారికి దయ, ఆనందాన్ని పంచండి’’అని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-28T19:56:13+05:30 IST