Samantha: సమంత ఎంతపని చేసింది, ఎక్కడికెళ్లిందో తెలుసా....

ABN , First Publish Date - 2023-04-18T17:08:40+05:30 IST

'శాకుంతలం' సినిమా ప్లాప్ అని తెలియగానే, ఇటు ఒక వేదాంతమైన పోస్ట్ పెట్టేసి, వెంటనే ఇంకో వెబ్ సిరీస్ షూటింగ్ కి లండన్ వెళ్ళిపోయింది సమంత.

Samantha: సమంత ఎంతపని చేసింది, ఎక్కడికెళ్లిందో తెలుసా....

సమంత (Samantha) ఇప్పుడు లండన్ (London) లో వుంది. సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ కోసం ఆమె ఇండియా నుండి లండన్ సిటాడెల్ టీం తో వెళ్ళిపోయింది. ఇక్కడ 'శాకుంతలం' (Shakuntalam) సినిమా ఎటువంటి కలెక్షన్స్ వచ్చాయో చూసి, తన ఇన్స్టాగ్రామ్ లో భగవద్ గీత (Bhagavad Gita) నుండి ఒక శ్లోకం తీసుకొని దాన్ని పోస్ట్ చేసి ఇంక తన పని అయిపొయింది, సినిమా గురించి చేసేది ఏమి లేదు అన్నట్టుగా ఒక వేదాంతమయిన శ్లోకం చెప్పి లండన్ వెళ్ళిపోయింది.

samanthacitadel.jpg

రాజ్ డీకే (#RajDK) లు ఈ 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్ (Varun Dhawan) లీడ్ యాక్టర్ గా చేస్తున్నాడు, అతనికి జోడిగా సమంత చేస్తోంది అని అంటున్నారు. ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి హిందీలో తీస్తున్న వెబ్ సిరీస్, ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వేసింది. రాజ్ డీకే (#RajDK) లు ఇంతకు ముందు 'ఫామిలీ మ్యాన్' (Family Man) అనే వెబ్ సిరీస్ తీసినప్పుడు ఆ రెండో సీజన్ లో సమంత నటించింది. అది పెద్ద విజయం సాధించింది. ఈమధ్యనే ఈ దర్శక ద్వయం 'ఫర్జీ' (Farzi) అనే వెబ్ సిరీస్ కూడా తీసి ఇంకో మంచి విజయాన్ని అందుకున్నారు.

Heroine Samantha.jpg

ఇప్పుడు 'సిటాడెల్' వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఇది స్పై జానర్. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసమని టీం మొత్తం లండన్ చేరుకొంది. సమంత ఈమధ్యనే 'ఖుషి' సినిమా షూటింగ్ కూడా కొంత కంప్లీట్ చేసింది. కానీ ఆమె ఇప్పుడు తెలుగు సినిమాల కన్నా, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ ల మీద చాలా దృష్టి పెట్టింది అని అంటున్నారు. సాంఘీక మాధ్యమం లో ఆమె లండన్ ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-04-18T17:09:39+05:30 IST