మెగా ప్రిన్స్ తో రాజమౌళి హీరోయిన్

ABN , First Publish Date - 2023-11-27T12:46:07+05:30 IST

వరుణ్ తేజ్ రాబోయే సినిమా 'మట్కా' షూటింగ్ కోసం సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రాజమౌళి హీరోయిన్ కూడా ఒక ముఖ్య పాత్రలో..

మెగా ప్రిన్స్ తో రాజమౌళి హీరోయిన్
Saloni and Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VarunTej), 'పలాస' ఫేమ్ దర్శకుడు అయిన కరుణ కుమార్ (KarunaKumar) తో 'మట్కా' #Matka సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొంత అయింది, కానీ మధ్యలో వరుణ్ తేజ్ వివాహం, తరువాత కుటుంబం, స్నేహితులకి, సన్నిహితులకు విందు ఇవ్వటంతో కొన్నాళ్ళు విరామం తీసుకోవం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారని ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, కాగా డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అని ఒక ప్రకటనలో చెప్పారు.

ఈ సినిమా కథ పీరియడ్ డ్రామా కావటంతో దీనికి ప్రీ-ప్రొడక్షన్ పని చాలా వుంది అని తెలిసింది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోరాటాన్ని సన్నివేశాలు కూడా వైవిధ్యంగా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

saloni.jpg

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో రాజమౌళి 'మర్యాదరామన్న' సినిమాలో సునీల్ పక్కన చేసిన నటి సలోని (సలోని) ఈ 'మట్కా' చిత్రంలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తోందని తెలిసింది. ఆమె ఈ పీరియడ్ డ్రామాలో విభిన్నమైన పాత్రలో కనపడనున్నారని, ఆమె పాత్ర షూటింగ్ కూడా కొంతమేర అయిందని తెలుస్తోంది. విజయవాడలో ఆమె షూటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా కాలం తరువాత సలోని ఒక తెలుగుసినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనపడనుందని కూడా తెలుస్తోంది. (Maryada Ramanna fame Saloni is all set to play a different role in Varun Teja and Karuna Kumar combination film Matka)

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు అని కూడా అంటున్నారు. ఇక మిగతా పాత్రల్లో నోరా ఫతేహి , మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ లో కూడా వున్నారు. 'మట్కా' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - 2023-11-27T12:46:08+05:30 IST