Salaar: భారీ అంచనాల మధ్య విడుదల.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ABN , Publish Date - Dec 22 , 2023 | 09:44 AM

ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.  కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. 

Salaar: భారీ అంచనాల మధ్య విడుదల.. నెటిజన్లు ఏమంటున్నారంటే..


ప్రభాస్‌ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్‌ (Salaar) చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేజీయఫ్‌ 2 లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. 

ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్‌లతో మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామునే షోలు పడ్డాయి. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన హిట్‌ పడలేదు. ఆయనతోపాటు ప్రేక్షకులు, అభిమానులు ఈ చిత్రం మీదే నమ్మకం పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిత్రం గురించి సోషల్‌ మీడియా వేదికగా ఏమనుకుంటున్నారో చూద్దాం. (Salaar twitter review)

సోషల్‌ మీడియా ఎక్స్‌(ట్విట్టర్‌)లో సలార్‌ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ నటన అద్భుతమని, నట విశ్వరూపాన్ని చూపించాడని ట్వీట్స్‌ చేస్తున్నారు. మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమార్‌న్ నటన  కూడా అదిరిపోయిందని అంటున్నారు. ప్రశాంత్‌ టేకింగ్‌పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఫస్టాఫ్‌ సూపర్‌ అని, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ఎసెట్‌ అని పేర్కొన్నారు. బ్లాక్‌ బస్టర్‌తో ఈ ఏడాది ముగించారని కామెంట్‌ చేస్తున్నారు.  కొందమంది వీక్షకులు యావరేజ్‌ సినిమా అని రాసుకొచ్చారు. సినిమా స్పెక్టాక్యూలర్‌ అని ఓ క్రిటిక్‌ రాసుకొచ్చారు. సెకెండాఫ్‌ ఎమోషన్, యాక్షన్ అదరిపోయిందని, ప్రభాస్‌ మాస్‌ మానియా చూపించారని అంటున్నారు. 


Updated Date - Dec 22 , 2023 | 01:24 PM