Salaar: కోడి కూత, ఊచకోత, ప్రభాస్ 'సలార్' టీజర్ మామూలుగా లేదుగా

ABN , First Publish Date - 2023-07-06T06:09:23+05:30 IST

ప్రభాస్, శృతి హాసన్ జంటగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'సలార్' టీజర్ వచ్చేసింది. కుమ్ముతోంది కూడా. ప్రభాస్ అభిమానులకు ఎలా అయితే ప్రభాస్ కనపడాలి అని అనుకుంటారో అలానే ఇందులో ఉంటాడు అని చెప్పేసాడు ప్రశాంత్ నీల్. ఇది రెండు పార్టులు అని కూడా చెప్పాడు. పృథ్వీరాజ్ కుమార్ కూడా ఇందులో వున్నాడు.

Salaar: కోడి కూత, ఊచకోత, ప్రభాస్ 'సలార్' టీజర్ మామూలుగా లేదుగా
Prabhas in Salaar

ప్రభాస్(Prabhas), దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' #Salaar సినిమా టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. #SalaarTeaser ఇందులో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక కాగా, మలయాళం నటుడు పృథ్విరాజ్ కుమార్ (PrudhvirajKumar) కూడా వున్నాడు. ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు 'కెజిఫ్' #KGF సినిమా కథని ఎలా అయితే ఒక వ్యక్తి నేరేట్ చేసుకుంటూ వెళతాడో ఈ 'సాలార్' #SalaarTeaser సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది అన్నట్టుగా చెప్పేసాడు. ఎందుకంటే టిన్ను ఆనంద్ (TinnuAnand) డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. అతను ప్రభాస్ గురించి చెపుతూ ఉంటాడు.

'లయన్ (Lion), చీతా, టైగర్, ఎలిఫెంట్ వెరీ డేంజరస్, బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ (JurrasickPark)' అనే డైలాగు తో మొదలవుతుంది. సింహం, చీతా, పులి, ఏనుగు చాలా ప్రమాదకరమైనవి, కానీ అవన్నీ జురాసిక్ పార్కులో ఏమీ చెయ్యలేవు, ఎందుకంటే అందులో వీటన్నిటికంటే పెద్ద జంతువు వుంది అనే అర్థం వచ్చేట్టు చెప్పాడు. అయితే ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా టిన్ను ఆనంద్ డైలాగ్ మొత్తం ఇంగ్లీష్ లో పెట్టేసాడు, కాబట్టి ఇంకా వేరే భాషలో సెపరేట్ గా ఆ డైలాగ్ చెప్పనవసరం లేదు. ఉదయం నుండి ప్రభాస్ అభిమానులకు పండగలా తయారయైనది. ఎందుకంటే 'కెజిఫ్' తరహాలోనే ఇందులో కూడా ప్రభాస్ ని బాగా ఎలివేట్ చేసే డైలాగ్ చెప్పించి, అప్పుడు ప్రభాస్ ని చూపిస్తాడు.

prabhas-salaar.jpg

అయితే ప్రభాస్ ని పూర్తిగా చూపించలేదు. ఒక పక్కనుండి మాత్రమే చూపించాడు. 'కెజిఫ్' లో ఎలా ఐంతే నేపధ్యం నల్లగా, గనులు, గన్నులు, బాంబులు, ఆ ధ్వనులు వినపడుతూ వుంటాయో ఇందులో అంతకి మించి అవన్నీ ఉంటాయి అని చెప్పకనే చెప్పాడు ప్రశాంత్ నీల్ ఈ 'సాలార్' టీజర్ తో. ఈ టీజర్ అంతటికీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదిరింది. అదే చాలా ముఖ్యం. సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేసేది బ్యాక్ గ్రౌండ్ సంగీతం మాత్రమే.

మొత్తం మీద 'ఆదిపురుష్' కి ప్రభాస్ కి వచ్చిన నెగటివిటీ అంతా ప్రశాంత్ నీల్ ఈ ఒక్క టీజర్ తో చెరిపేసాడు. 'ఆదిపురుష్' ని ఇంక ప్రభాస్ అభిమానులు మరిచిపోయి, ఈ 'సాలార్' మీద దృష్టి పెడతారు. అదే కదా ప్రభాస్ కి కావలసింది. ఈ సినిమా రెండు పార్టులు ఉంటుంది అని చాలా క్లియర్ గా చెప్పేసాడు ఈ టీజర్ లో. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది అని కూడా చెప్పేసాడు. తెల్లవారుజామున ఈ టీజర్ విడుదల చేశారు కాబట్టి, 'కోడి కూత ఊచ కోత' అని అంటున్నారు ప్రభాస్ అభిమానులు.

Updated Date - 2023-07-06T06:10:08+05:30 IST