Salaar: ప్రభాస్ సినిమా విడుదల వాయిదా, టీము స్పందన ఏంటంటే...

ABN , First Publish Date - 2023-11-06T15:23:10+05:30 IST

ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా విడుదల మళ్ళీ వాయిదా పడనుంది అనే వార్తల మీద ఆ చిత్ర టీము స్పందించింది. అయితే ఇంతకీ ఈ సినిమా వాయిదా వేసారా, అదే తేదీకి విడుదల చేస్తున్నారా...

Salaar: ప్రభాస్ సినిమా విడుదల వాయిదా, టీము స్పందన ఏంటంటే...
Prabhas from Salaar

గత కొన్ని రోజుల నుండి ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' #Slaar సినిమా మళ్ళీ విడుదల వాయిదా పడనున్నది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఇంతకు ముందు చాలా సార్లు విడుదల వాయిదా వేస్తూ వచ్చారు, కానీ తప్పకుండా డిసెంబర్ 22 న విడుదల చేస్తాం అని కొన్ని వారాల క్రితం ప్రకటించారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా రావటం లేదని, షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) 'డంకి' #Dunki అదే రోజు విడుదల అవుతూ ఉండటంతో, ఆ సినిమా కోసమని 'సలార్' విడుదల వాయిదా వేస్తున్నట్టుగా వార్త వస్తోంది. #SalaarCeaseFireOnDec22

prabhasbday4.jpg

అయితే విడుదల వాయిదా పడుతోంది అనే వార్త మీద చిత్ర దర్శకుడు, నిర్మాత స్పందించలేదు కానీ, ఈరోజు ఆ చిత్ర టీము ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఆ సినిమాలో నటించిన మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (PrudhvirajSukumaran) తీసుకున్నారు అని. అదే ప్రకటనలో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదలవుతోంది అని చెప్పారు.

దీనిని బట్టి 'సలార్' డిసెంబర్ 22న విడుదల అవుతున్నట్టుగా మరోసారి చిత్ర నిర్వాహకులు పునరుద్ఘాటించినట్టుగా ఈ అధికారిక ప్రకటన చెప్పకనే చెపుతోంది. అంటే షా రుఖ్ ఖాన్ తో, ప్రభాస్ డిసెంబర్ 22న పోటీ పాడటానికి నిశ్చయించుకున్నాడు అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయికగా నటిస్తోంది. మలయాళం నటుడు పృథ్విరాజ్ ప్రతినాయకుడిగా చేస్తుండగా, జగపతి బాబు (JagapathiBabu), శ్రీయా రెడ్డి (SriyaReddy) ఇతర ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు.

Updated Date - 2023-11-06T15:23:11+05:30 IST