scorecardresearch

Salaar : షో నిలిపివేత.. పోలీసులతో వాగ్వాదం

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:40 PM

హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని మల్లికార్జున థియేటర్లో సలార్‌ ప్రీమియర్‌ షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.

Salaar : షో నిలిపివేత.. పోలీసులతో వాగ్వాదం

హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని మల్లికార్జున థియేటర్లో సలార్‌ ప్రీమియర్‌ (Salaar premier Show) షోను నిర్వాహకులు నిలిపివేశారు. ఎక్కువ మంది థియేటర్లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్  నీల్‌ (Prashanth neel) దర్శకత్వంలో వహించిన పాన్  ఇండియా చిత్రం సలార్‌. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగంధూర్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తుంది. 


Updated Date - Dec 22 , 2023 | 03:42 PM