Salaar Release Date : సలార్ వచ్చేది ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-09-29T11:52:51+05:30 IST

ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్, తదితర కారణాల చేత వాయిదా పడింది.

Salaar Release Date : సలార్  వచ్చేది ఎప్పుడంటే..

ప్రభాస్(Prabhas), శృతి హాసన్ (shruthi haasan)జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' (Salaar) ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్స్, తదితర కారణాల చేత వాయిదా పడింది. అయితే తాజాగా కొత్త విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. మాస్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ  సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోందని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ పోస్టర్‌ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియ్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈ పోస్టర్‌లో బీభత్సం సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఒళ్లంతా రక్తం నిండిపోయింది. ప్రతినాయకులను  వెంటాడి  వేటాడినట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ చేతిలో కత్తి, ఒంటికి అంటిన రక్తం చూస్తేనే ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది. ఈ  చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మూడు హ్యాష్‌ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘ఎక్స్‌’లో ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ (#SalaarCeaseFire) హవానే కనిపిస్తోంది. 

Updated Date - 2023-09-29T12:38:23+05:30 IST