Salaar booking records : రికార్డు స్థాయిలో బుకింగ్‌.. యాప్స్‌ క్రాష్‌..

ABN , Publish Date - Dec 21 , 2023 | 05:24 PM

ప్రభాస్‌ హీరోగా నటించిన 'సలార్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అడ్వాన్స్  బుకింగ్‌ ఓపెన్  చేయగానే అభిమానులు, ప్రేక్షకులు ఆన్ లైన్ బుకింగ్‌ యాప్స్‌పై పడ్డారు. దాంతో సదరు యాప్‌ కొంత సమయం క్రాష్‌ అయిపోయాయి. అయినప్పటికీ అభిమానులు ఎక్కడా తగ్గలేదు.

 Salaar booking records : రికార్డు స్థాయిలో బుకింగ్‌.. యాప్స్‌ క్రాష్‌..

ప్రభాస్‌ హీరోగా నటించిన 'సలార్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అడ్వాన్స్  బుకింగ్‌ ఓపెన్  చేయగానే అభిమానులు, ప్రేక్షకులు ఆన్ లైన్ బుకింగ్‌ యాప్స్‌పై పడ్డారు. దాంతో సదరు యాప్‌ కొంత సమయం క్రాష్‌ అయిపోయాయి. అయినప్పటికీ అభిమానులు ఎక్కడా తగ్గలేదు. బుకింగ్‌ చేస్తూనే ఉన్నారు. అనలైనలో ఓపెన్  చేయగానే రికార్డ్‌ స్థాయిలో టికెట్లు కొనుగోలు చేశారు. నిన్న రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఈ సినిమాకి ఎన్ని టికెట్లు తెగాయి అనే విషయంపై నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు సంబంధించి నేషనల్‌ చైన్‌ మల్టీప్లెక్స్‌ అయినా పివిఆర్‌- ఐనాక్స్‌, సినీ పోలీస్‌ మినహాయించి ఇప్పటివరకు 30 లక్షల 50 వేల టికెట్లు అమ్ముడు అయ్యాయి. ఏపీలో 13 లక్షల 25000, నైజాం 6 లక్షలు, నార్త్‌ ఇండియా 5,25,000, కర్ణాటక 3. 25 వేలు, కేరళలో లక్షన్నర, తమిళనాడులో లక్ష ఇలా మొత్తానికి 30 లక్షల 25 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఇప్పటివరకు అమ్ముడుపోయిన టికెట్ల సంఖ్య ఇదని, అడిషనల్‌  స్క్రీన్స్  కూడా త్వరలోనే బుకింగ్స్‌ ఓపెన్‌ చేస్తామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రశాంత్  నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్‌ కిరగంధూర్‌ నిర్మించారు. ప్రభాస్‌ సరసన శ్రుతీహాసన్‌ నటించింది. జగపతిబాబు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రధారులు. 

Updated Date - Dec 21 , 2023 | 05:24 PM