Salaar: శ్రేయారెడ్డి పనై పోయింది.. ఇంకా నాలుగు నెలలే!

ABN , First Publish Date - 2023-05-26T15:23:41+05:30 IST

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ‘కేజీఎఫ్‌’ చిత్రం తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘

Salaar: శ్రేయారెడ్డి పనై పోయింది.. ఇంకా నాలుగు నెలలే!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth neel) తెరకెక్కిస్తున్న ప్యాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’(salaar). హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ‘కేజీఎఫ్‌’ చిత్రం తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మోస్ట్‌ వయొలెంట్‌ మెన్‌, వన్‌ మెన్‌ కాల్డ్‌ మోస్ట్‌ వయోలెంట్‌’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌తో సినిమాపై మరింత క్రేజ్‌ పెరిగింది. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే విడుదలకు ఉన్న సమయం కేవలం నాలుగు నెలలు. ఇంత తక్కువ టైమ్‌ భారీ ప్రాజెక్ట్‌ విడుదల చేయాలంటే ఏ దర్శకుడికైనా కాస్త టెన్షన్‌ ఉంటుంది. కానీ ప్రశాంత్‌ నీల్‌కి మాత్రం ఆ టెన్షన్‌ ఏ మాత్రం లేదు. మరో నాలుగు నెలల్లో సినిమా విడుదల పెట్టుకుని కూల్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల కథానాయిక శ్రుతీహాసన్‌ కూడా తన పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసి వెకేషన్‌కి వెళ్లింది. తాజాగా మరో నటి శ్రియారెడ్డి (Sriya reddy)పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తి చేశారు ప్రశాంత్‌ నీల్‌. ఈ విషయాన్నిశ్రియారెడ్డి (Sriya reddy shoot completed) ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

‘‘సలార్‌’లో నా పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది. దర్శకుడు నా పాత్రను విజువలైజ్‌ చేసిన తీరు బావుంది. నేను సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా. ఆ క్యారెక్టర్‌కు నేను న్యాయం చేస్తానని నమ్మి నా చేత ఈ పాత్ర చేయించారు. ఈ జర్నీలో నాకు సహకరించిన టీమ్‌ అందరికీ కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘పొగరు’ సినిమాలో నెగటివ్‌ క్యారెక్టర్‌ చేసి గుర్తింపు శ్రియారెడ్డి ఆ తర్వాత కాస్త సినిమాలు తగ్గించింది. ఈ సినిమా కోసం తనని ఒప్పించిన ప్రశాంత్‌ నీల్‌కు థ్యాంక్స్‌ చెప్పింది. ఈ మేరకు దర్శకుడు, డిఓపీ భువన్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. అనుమతి లేకుండా ‘సలార్‌’ సినిమా అప్‌డేట్‌ ఏదీ బయటకు వెళ్లకూడదని దర్శకుడు నిబంధన పెట్టారు. ‘సలార్‌’ కొత్త న్యూస్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చారు శ్రియారెడ్డి మరోవైపు ప్రశాంత్‌ తీరుకు నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా విడుదలకు నాలుగు నెలలు కూడా లేదు. ఇంత భారీ ప్రాజెక్ట్‌.. అందులోనూ రెండు భాగాలు ఇంత కూల్‌గా ఎలా ఉన్నావ్‌ బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-26T15:23:41+05:30 IST