Salaar: ప్రభాస్‌ ఇటలీలో ఏం చేస్తున్నారు!

ABN , First Publish Date - 2023-03-17T15:48:11+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ‘సలార్‌’ షూటింగ్‌ వేగం పెంచారు. ఆయన అభిమానులు ఎంతగానో కోరుకునే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి ప్రభాస్‌ సిద్ధమవుతున్నారు.

Salaar: ప్రభాస్‌ ఇటలీలో ఏం చేస్తున్నారు!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ‘సలార్‌’(salaar) షూటింగ్‌ వేగం పెంచారు. ఆయన అభిమానులు ఎంతగానో కోరుకునే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి ప్రభాస్‌ సిద్ధమవుతున్నారు. సినిమా గురించి నిర్మాణ సంస్థ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకపోయినా అంచనాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం కోసం భారీ యాక్షన్‌ సీన్స్‌ రూపొందిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఇటలీలో (shootng at Italy) జరుగుతోందని సమాచారం. అక్కడ ప్రభాస్‌, విలన్‌ గ్యాంగ్‌పై సాగే భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఎపిసోడ్‌ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ షెడ్యూల్‌తో 85 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని, వచ్చే నెలతో సినిమా పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు వెళ్తారట. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28వ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-03-17T15:48:13+05:30 IST