సలామ్‌... లెజెండ్స్‌

ABN , First Publish Date - 2023-05-20T03:03:41+05:30 IST

సినిమాల్లో రజనీకాంత్‌, క్రికెట్‌లో కపిల్‌ దేవ్‌. ఇద్దరూ లెజెండ్సే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా కోసం పని చేస్తున్నారు....

సలామ్‌... లెజెండ్స్‌

సినిమాల్లో రజనీకాంత్‌, క్రికెట్‌లో కపిల్‌ దేవ్‌. ఇద్దరూ లెజెండ్సే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా కోసం పని చేస్తున్నారు. అదే.. ‘లాల్‌ సలామ్‌’. రజనీ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌లు హీరోలుగా నటిస్తున్నారు. రజనీకాంత్‌ కీలక పాత్రధారి. ఇప్పుడు ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌ కూడా మెరవబోతున్నారు. ‘‘కపిల్‌దేవ్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ అందించి దేశం గర్వపడేలా చేశారాయన’’ అంటూ రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. ముంబై డాన్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా సూపర్‌స్టార్‌ కనువిందు చేయబోతున్న ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - 2023-05-20T03:03:41+05:30 IST