Saindhav: వెంకటేశ్‌ కెరీర్‌లోనే.. ఎక్స్‌పెన్సివ్‌ సీన్‌!

ABN , First Publish Date - 2023-08-13T16:33:07+05:30 IST

వెంకటేశ్‌(venkatesh) హీరోగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శ్రద్థా శ్రీనాథ్‌(Shradda Srinath), రుహాని శర్మ, ఆండ్రాయా జెర్మియా, సారా నాయికలుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Saindhav: వెంకటేశ్‌ కెరీర్‌లోనే.. ఎక్స్‌పెన్సివ్‌ సీన్‌!

వెంకటేశ్‌(venkatesh) హీరోగా శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శ్రద్థా శ్రీనాథ్‌(Shradda Srinath), రుహాని శర్మ, ఆండ్రాయా జెర్మియా, సారా నాయికలుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకట్‌ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న 75వ చిత్రమిది. ఇటీవల మేకర్స్‌ 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, ఎనిమిది మంది ముఖ్య నటీనటులపై హార్స్‌ కండీషన్‌లో హై-ఆక్టేన్‌ ఎమోషనల్‌ క్లైమాక్స్‌ను చిత్రీకరించారు. రామ్‌ - లక్ష్మణ్‌ నేతృత్వంలో ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ రూపొందించారు. వెంకటేశ్‌ కెరీర్‌లో మోస్ట్‌ ఎక్స్‌పెన్సివ్‌ క్లైమాక్స్‌ ఇదేనని చిత్ర బృందం చెబుతోంది. ఆ యాక్షన్‌ పార్ట్‌ అద్భుతంగా వచ్చిందంటూ చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. పాన్‌ ఇండియా చిత్రాన్ని అన్ని దక్షిణాది భాషలతోపాటు హిందీలో డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు. నవాజుద్దీన్‌ సిద్థిక్‌, శ్రద్థా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ మణికందన్‌ కెమెరామెన్‌గా, గ్యారీ బిహెచ్‌ ఎడిటర్‌ గా, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

Updated Date - 2023-08-13T16:34:26+05:30 IST