NTR30: హైదరాబాద్ లో ఎన్టీఆర్ తో సైఫ్ అలీ ఖాన్, ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-04-18T11:23:18+05:30 IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయి, నేరుగా ఎన్టీఆర్30 షూటింగ్ లొకేషన్ కి వెళ్లారు. ఈరోజు నుండి షూటింగ్ లో పాల్గొంటున్నారు, దీనితో అతను చేస్తున్నాడా లేదా అన్న రూమర్లకు చెక్ పడింది

NTR30: హైదరాబాద్ లో ఎన్టీఆర్ తో సైఫ్ అలీ ఖాన్, ఫోటోస్ వైరల్
Koratala Siva, Saif Ali Khan and NTR at the shooting of NTR30

ఈమధ్య సాంఘీక మాధ్యమాల్లో వచ్చిన అన్ని రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఎన్టీఆర్30 #NTR30 చిత్ర నిర్వాహకులు ఈరోజు కొన్ని ఫోటోస్ విడుదల చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్ #SaifAliKhan, హైదరాబాద్ (Hyderabad) లో ల్యాండ్ అయ్యాడు. ఎన్టీఆర్ 30 #NTR30 షూటింగ్ లో పాల్గొనడానికి ఈరోజు షూటింగ్ స్పాట్ కి కూడా చేరుకున్నాడు. ఎన్టీఆర్, (NTR) దర్శకుడు కొరటాల శివ(Director Koratala Siva), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ని కలిసి అతనితో మాట్లాడారు. దీనితో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

ntr30saifalikhan1.jpg

సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్30 లో వున్నాడా, లేడా అని గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది సైఫ్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసినట్టు, మరికొంతమంది సైఫ్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చినా చెయ్యను అని చెప్పినట్టు ఇలా రకరకాలుగా వార్తలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ntr30saifalikhan2.jpg

చిత్ర నిర్వాహకులు ఆ వార్తలు వచ్చినప్పుడు వాటి గురించి ఏమీ మాట్లాడలేదు కానీ, ఇప్పుడు డైరెక్ట్ గా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ కి వచ్చిన ఫోటోస్ ని పంపారు. దీనితో అందరికీ #NTR30 ఒకటి క్లియర్ గా అర్థం అయిపొయింది. న్తర్ 0 మామూలు సినిమా కాదు, అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా, అందులో చాలా విషయం వుంది అందుకే ఆ సినిమా కోసం ఎంతటి బడ్జెట్ అయినా వెనుకాడకుండా చెయ్యాలి అని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు అని తెలుస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఆమె కూడా హైద్రాబాద్లో ఈ సినిమా షూటింగ్ లో వుంది.

Updated Date - 2023-04-18T11:23:21+05:30 IST