Sai Pallavi: మరోసారి నాగచైతన్యతో జట్టు కడుతున్న ఈ మలయాళ నటి

ABN , First Publish Date - 2023-09-19T14:54:58+05:30 IST

'లవ్ స్టోరీ' జంట నాగ చైతన్య, సాయి పల్లవి మరోసారి జోడీగా కనపడనున్న. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ నాగచైతన్య ఎన్.సి23 సినిమాలో సాయి పల్లవి ని తీసుకున్నట్టుగా సమాచారం. నిర్మాత సంస్థ గీత ఆర్ట్స్ ఒక వీడియో విడుదల చేసింది, కానీ అందులో అమ్మాయి ముఖం చూపించలేదు.

Sai Pallavi: మరోసారి నాగచైతన్యతో జట్టు కడుతున్న ఈ మలయాళ నటి
File picture of Naga Chaitanya and Sai Pallavi

నాగ చైతన్య (NagaChaitanya), దర్శకుడు చందు మొండేటి (ChandooMondeti) నిజ సంఘటనల ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గీత ఆర్ట్స్ (GeethaArts), బన్నీ వాసు (BunnyVas) నిర్మాత. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం బన్నీ వాసు, నాగ చైతన్య, చందు అందరూ శ్రీకాకుళం (Srikakulam) దగ్గరలో వున్న సముద్ర తీరానికి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారిని స్వయంగా పరిశీలించారు. అలాగే సముద్రం మీదకి కూడా బోట్స్ లో వెళ్లారు.

nagachaitanya1.jpg

ఈ సినిమా మీద చాలా రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తోంది. సముద్రం మీద చేపలు పట్టి బతికేవారి జీవనశైలి ఆధారంగా ఈ సినిమా నేపధ్యం ఉండొచ్చు అని అంటున్నారు. ఆలా సముద్రం మీద చేపలు పట్టడానికి వెళ్లి, ఒక్కోసారి దాని తెలియక, వేరే దేశాలకు వెళ్లిపోయిన వారు కూడా వున్నారు. ఆలా కొన్ని వందలమంది వేరే దేశాల్లో ఇప్పటికీ వుంటున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఒక ప్రేమ కథని దర్శకుడు చందు రాసాడని, ఇలా కొన్ని యదార్ధ సంఘటనలు ఇందులో ఉండొచ్చు అని అంటున్నారు.

అయితే ఇందులో కథానాయిక ఎవరు అనేది మాత్రం ఈ చిత్ర నిర్వాహకులు ఇంతవరకు చెప్పలేదు. ఈరోజు ఎన్.సి 23 లో చేరబోయే అమ్మాయి ఈమె అని ఒక వీడియో విడుదల చేశారు కానీ అందులో ఆమె ముఖం మాత్రం చూపించలేదు. కానీ ఆ వీడియోలో చందు బోర్డు మీద మాత్రం కాజల్, అన్నపూర్ణ అని పేర్లు మాత్రం రాసాడు, అది వీడియోలో వుంది. కానీ ఆ అమ్మాయి ముఖం మాత్రం చూపించలేదు.

saipallavi3.jpg

అయితే తాజా సమాచారం ప్రకారం ఆ అమ్మాయి ఎవరో కాదు, సాయి పల్లవి (SaiPallavi) అని అంటున్నారు. సాయి పల్లవి ఇంతకు ముందు నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ' #LoveStory సినిమా చేసింది, అది చాలా పెద్ద హిట్ అయింది. అదే పెయిర్ ని ఇందులో కూడా అనుకున్నారని, అదీ కాకుండా ఇందులో కథానాయికకు కూడా చాలా ప్రాముఖ్యం ఉందని, అందుకని సాయి పల్లవి అయితేనే సరిపోతుందని చిత్ర నిర్వాహకులు అనుకున్నారని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మాయి ముఖం ఎప్పుడు చూపిస్తారో చూడాలి !

Updated Date - 2023-09-19T14:54:58+05:30 IST