Virupaksha: విరూపాక్ష ఏ ఓటిటిలో వస్తోందో తెలుసుగా...

ABN , First Publish Date - 2023-04-21T15:59:41+05:30 IST

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' ఏ ఓటిటి లో వస్తుందో తెలుసా. కార్తీక్ దండు మొదటి సారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా...

Virupaksha: విరూపాక్ష ఏ ఓటిటిలో వస్తోందో తెలుసుగా...

సాయి ధరమ్ తేజ్ #SaiDharamTej నటించిన 'విరూపాక్ష' #VirupakshaFilm సినిమా ఈరోజు విడుదలయి మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. సాంఘీక మాధ్యమం అంతా ఈ సినిమా గురించి, అలాగే సినిమా పరిశ్రమలో అందరూ సాయి ధరమ్ తేజ్ కి శుభాకాంక్షల మెసేజ్ లు పెడుతూ వున్నారు. కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) స్క్రీన్ ప్లే అందించటం ఈ సినిమాకి ఒక ప్లస్ అయింది. అలాగే ఈ సినిమాకి సంగీత నేపధ్యం, ఛాయాగ్రహణం కూడా చాలా బావున్నాయి.

ఇవాళ మొదటి రోజు, ఇలా పాజిటివ్ గా ఈ సినిమా వుంది అంటే, ఈ వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగుంటాయి అని అనుకుంటున్నారు. మొదటి సారిగా అందరూ వేరే టాక్ కాకుండా ఒక్కటే మాట 'బాగుంది' అని మాట్లాడుకుంటున్న సినిమా ఈమధ్య కాలం లో ఇదే అవటం విశేషం. మరి ఈ సినిమా ఏ ఓటిటి లో వస్తోందో తెలుసా? నెట్ ఫ్లిక్స్ #Netflix వాళ్ళు ఈ సినిమాని చాలా మంచి రేట్ కి కొన్నారు అని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వస్తుంది, ఎప్పుడు అనేది త్వరలో తెలుస్తుంది.

saidharamtej1.jpg

ఇంకా ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కి ఒక పెద్ద కంబ్యాక్ సినిమాగా కూడా ఉంటుంది. ఎందుకంటే అతనికి బైక్ మీద నుంచి పడిపోయి యాక్సిడెంట్ అయినపుడు కోలుకోవడానికి చాలాకాలం పట్టింది. ఆ తరువాత ఈ సినిమా ఒప్పుకోవటం జరిగింది. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా వచ్చింది, అందుకని అందరికీ కొంచెం కుతూహలం గా వుండింది ఈ 'విరూపాక్ష' #Virupaksha ఎలా వుండబోతోంది అని. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయిక కాగా ఆమెకి ఇది నాలుగో హిట్ సినిమా అవుతుంది తెలుగులో వరసగా. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా ఓటిటి లో కూడా విజయం సాధిస్తుంది అనటం లో సందేహం లేదు.

Updated Date - 2023-04-21T15:59:41+05:30 IST