సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Virupaksha: 36 ఏళ్ల వయసులో మాటలు నేర్చుకున్నాను

ABN, First Publish Date - 2023-04-19T15:07:25+05:30

'విరూపాక్ష' సినిమా ప్రచారాలు చేస్తున్న సాయి ధరమ్ తేజ్ తన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాడు. యాక్సిడెంట్ అయ్యాక ఏమైంది, తరువాత మళ్ళీ ఎలా మామూలు మనిషయ్యేడు అంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' (Virupaksha) ఈనెల 21 న విడుదల అవుతోంది. ఇందులో సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయిక, కాగా కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకుడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు, అది కొంచెం ఆసక్తికరం. ఈ సినిమా గురించి, తన యాక్సిడెంట్ గురించి సాయిధరమ్ తేజ్ చెప్పిన విశేషాలు.

ఈ 'విరూపాక్ష' #Virupaksha సినిమా ఎదో మాస్ ఇమేజ్ వచ్చిందని, లేదా వస్తుందని చెయ్యలేదని, ఓ మంచి సినిమాను చేయాలని చేశానని చెప్పాడు సాయి. 'విరూపాక్ష' సినిమాకు సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉంటారు అని అనుకుంటాని, కానీ ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా కూడా ఉంటుంది. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా తరువాత ప్రపంచం అంతా తెలుగు సినిమా వేపు చూస్తోదని, అందుకు తెలుగుదనాన్ని పాన్ ఇండియా వైపు తీసుకెళ్లాలి అని చెప్పాడు. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రపంచానికి మనం తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాం, అని చెప్పాడు.

హారర్ సినిమాలు చూడటం వేరు, చేయడం వేరు అని అన్నాడు సాయి ధరకే తేజ్. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని చాలామంది అనుకున్నారు, "కానీ మా అమ్మ నాకు మళ్లీ మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. 36 ఏళ్ల వయసులో మళ్లీ నాకు మాటలు నేర్పించారు. మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి" అని చెప్పాడు.

'విరూపాక్ష' కథ 80, 90వ దశకంలో జరుగుతుందని, ఒక వూరిలో వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు, ఆ ఊరి మీద చేతబడి చేయించారా? అనే దాని చుట్టూ జరిగే కథ ఈ సినిమా. మరి నిజ జీవితంలో సాయి ధరమ్ తేజ్ చేతబడిని నమ్ముతాడా అంటే, నమ్మను అని చెప్పాడు. కానీ ఆంజనేయుడ్ని బాగా నమ్ముతాను అంటూ ఆయన తోడుంటే మనకు ఏం కాదని అనుకుంటాను అని చెప్పాడు.

Updated Date - 2023-04-19T15:07:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!