Sai Dharam Tej : శత్రువులపై గాంజా శంకర్‌ మాస్‌ దాడి..!

ABN , First Publish Date - 2023-10-15T10:10:02+05:30 IST

సుప్రీమ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ (Sai dharam Tej) తన అభిమానులను, మెగా అభిమానులను అలరించిడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. తాజాగా ఆయన పూర్తి మాస్‌ యాక్టర్‌గా కమర్షియల్‌ యాక్షన్‌ సినిమా చేయబోతున్నారు.

Sai Dharam Tej : శత్రువులపై  గాంజా శంకర్‌ మాస్‌ దాడి..!

సుప్రీమ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ (Sai dharam Tej) తన అభిమానులను, మెగా అభిమానులను అలరించిడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. తాజాగా ఆయన పూర్తి మాస్‌ యాక్టర్‌గా కమర్షియల్‌ యాక్షన్‌ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్‌’(Ganja shankar). సంపత్‌ నంది 9Sampath nandi) ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. హీరో పాత్రను అత్యంత బలంగా చూపించడంలో ఎక్స్‌పర్ట్‌ సంపత నంది. ఇప్పుడు గాంజా శంకర్‌ను అలాగే తెరకెక్కించనున్నారు. ఆదివారం హీరో సాయిధరమ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ను, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోస్టర్‌లో తేజ్‌ యాటిట్యూడ్‌ చూస్తుంటే ఎటువంటి ముప్పునైనా తొలగించగల శక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నాయకుడి తన శత్రువులపై ‘మాస్‌ దాడి’ని పారంభించబోతున్నాడని దర్శకుడు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ఓ టీజర్‌ వదిలారు.

"నిద్రపోయే ముందు సూపర్‌ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా, శంకర్‌ కథను, హీరో క్యారెక్టర్‌ గురించి వివరించారు దర్శకుడు. తన సృజనాత్మకతో సంపత్‌ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. తేజ్‌ నుంచి ఇప్పటిదారా పూర్తిస్థాయి మాస్‌ సినిమా రాలేదు. మొదటిసారి ఆయన ఈ తరహా పాత్ర పోషిస్తున్నారు. ‘గాంజా శంకర్‌‘ తో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాస్‌ నిర్వచనం ఇవ్వబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సంస్థ సమర్పిస్తోంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Updated Date - 2023-10-15T10:10:02+05:30 IST