Sagileti Katha: రామ్‌గోపాల్‌ వర్మ చేతులమీదుగా... ఏదో జరిగే!

ABN , First Publish Date - 2023-08-19T17:45:25+05:30 IST

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి -  స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ‘ఏదో జరిగే’ అంటే సాగే లిరికల్‌ సాంగ్‌ను రామ్‌గోపాల్‌ర్మ తన కార్యాలయంతో విడుదల, చేశారు.

Sagileti Katha: రామ్‌గోపాల్‌ వర్మ చేతులమీదుగా... ఏదో జరిగే!

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి - స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనుహ్య స్పందన లభించింది. ఇందులో ‘ఏదో జరిగే’ అంటే సాగే లిరికల్‌ సాంగ్‌ను రామ్‌గోపాల్‌ర్మ తన కార్యాలయంతో విడుదల, చేశారు. ఆర్‌జీవీ మాట్లాడుతూ ‘‘సగిలేటి కథ సినిమా ట్రైలర్‌ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. చిత్రాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్‌ ‘రాజశేఖర్‌ సుద్మూన్‌’కి, బ్యూటిఫుల్‌గా ఉండి అందరిని కవ్వించిన కీర్తన శేష్‌కి నా ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు.

నిర్మాతలు దేవీప్రసాద్‌ బలివాడ మాట్లాడుతూ ‘‘చిన్నప్పటి నుంచి ఆర్‌జీవీ ప్రభావం నాపై ఉంది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే కారణం. నేను నిర్మించిన తొలి చిత్రం ‘కనబడుటలేదు’ నుంచి ‘సగిలేటి కథ’ వరకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హెల్ప్‌ చేస్తున్న వర్మగరాఇకి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘మా సినిమా పాటను రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేయడం డబల్‌ ఎనర్జీ ఇచ్చింది. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న హీరో నవదీప్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా విడుదలకు అన్నీ సమకూర్చి సహకరిస్తున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2023-08-19T17:45:25+05:30 IST