భీమ్లా నాయక్ ద‌ర్శ‌కుడు సాగర్ కె చంద్ర, శ్రీనివాస్ బెల్లంకొండ చిత్రం నుంచి క్రేజీ ఆప్డేట్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 06:25 PM

ప్రామిసింగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర, ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BSS10 కోసం కలిసి పని చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని వర్కింగ్ స్టిల్స్ తో పాటు ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు.

భీమ్లా నాయక్ ద‌ర్శ‌కుడు సాగర్ కె చంద్ర, శ్రీనివాస్ బెల్లంకొండ చిత్రం నుంచి క్రేజీ ఆప్డేట్‌
sagar , bellamkonda

ప్రామిసింగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ(BSaiSreenivas), ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర (saagar chandra k), ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్(14 Reels Plus) నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BSS10 కోసం కలిసి పని చేస్తున్నారు. రామ్ ఆచంట(Raam Achanta), గోపి ఆచంట (Gopi Achanta ) నిర్మిస్తున్నారు. హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈహై బడ్జెట్ చిత్రం, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మేకర్స్ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని విడుదల చేయ‌డంతో పాటు ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. #BSS10 టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇందులో బెల్లంకొండను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి సాగర్ కె చంద్ర పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు


ధ‌మాకా, బ‌ల‌గం వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న‌ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించగా, ముఖేష్ జ్ఞానేష్ డీవోపీగా , కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్ , రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 06:25 PM