Rules Ranjann: అవును న్యూమరాలజీ కోసమే పెట్టింది: రూల్స్ రంజన్ దర్శకుడు

ABN , First Publish Date - 2023-09-16T15:55:01+05:30 IST

సినిమా టైటిల్స్ పెట్టడంలో న్యూమరాలజీ అనేది చాలా కాలం నుండి ఉంటూ వస్తోంది. ఇప్పుడు తాజాగా 'రూల్స్ రంజన్' సినిమా ఇంగ్లీష్ టైటిల్ కి 'ఎన్' అక్షరం ఒకటి ఎక్కువ పెట్టారు. అలాగే ఇంతకు ముందు జ్యోతి కృష్ణ గా అందరికీ పరిచయం అయిన దర్శకుడు ఇప్పుడు రత్నం కృష్ణ గా ఈ సినిమాతో మారాడు. ఇవన్నీ న్యూమరాలజీ కోసమే మార్చారు

Rules Ranjann: అవును న్యూమరాలజీ కోసమే పెట్టింది: రూల్స్ రంజన్ దర్శకుడు
A still from Rulrs Ranjann

కిరణ్ అబ్బవరం(KiranAbbavaram), నేహా శెట్టి (NehaShetty) జంటగా నటిస్తున్న 'రూల్స్ రంజన్' #RulesRanjann అక్టోబర్ 6 న విడుదలకి సిద్ధం అవుతోంది. ముందుగా సెప్టెంబర్ 28న అనుకున్నారు కానీ, చాలా సినిమాలు అదే రోజు విడుదలవడంతో ఈ సినిమాని అక్టోబర్ 6కి పోస్టుపోన్ చేశారు. ఈ సినిమా ఇంగ్లీష్ టైటిల్ కనక చూస్తే రంజన్ లో 'ఎన్' అక్షరం ఒకటి ఎక్కువపెట్టారు.

అలాగే దర్శకుడు రత్నం కృష్ణ (RathinamKrishna) పేరులో కూడా ఈ న్యూమరాలజీ ప్రకారం ఒక 'ఐ' అనే ఇంగ్లీష్ అక్షరాన్ని ఆతని పేరులో చేర్చారు. ఇదే విషయాన్ని దర్శకుడు రత్నం కృష్ణని అడిగితే, అతను ఈ న్యూమరాలజీ ని నమ్ముతాను అని చెప్పాడు. అందుకే 'రూల్స్ రంజన్' ఇంగ్లీష్ టైటిల్ లో ఒక అక్షరం ఎక్కువ పెట్టమని, అలాగే అతని పేరులో కూడా 'ఐ' అక్షరం చేర్చామని అన్నాడు.

RathinamKrishna1.jpg

ఇంతకు ముందు అతని పేరు జ్యోతి కృష్ణ అని ఉండేది, ఇప్పుడు రత్నం కృష్ణగా మార్చుకున్నాడు. ఇతని తండ్రి ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన ఎ ఎమ్ రత్నం (AMRatnam). అందుకనే ఇతని పేరు రత్నం కృష్ణగా మార్చుకున్నాడు అని తెలిసింది. ఈ సినిమా అంత చాలా వినోదాత్మకంగా ఉంటుంది అని చెప్పాడు దర్శకుడు జ్యోతి రత్నం.

ఇందులో చాలా కాంబినేషన్ నటులు వున్నారని, అందరికీ కథలో ప్రాముఖ్యం ఉంటుందని కూడా చెప్పాడు. సినిమా అంత నవ్వుతూనే వుంటారు అని, అంత కూడా అప్పటికప్పుడు అనుకున్న మాటలే సినిమాలో పెట్టమని అందుకే ఎక్కువమంది అనుకుంటున్న, మాట్లాడుతున్న మాటలే సినిమాలో కూడా వినపడతాయని చెప్పాడు.

Updated Date - 2023-09-16T15:55:01+05:30 IST