Venkatesh Daggubati: సైంధవ్ లో రుహాని శర్మ ఏమి చేస్తోందో తెలుసా

ABN , First Publish Date - 2023-04-22T09:58:35+05:30 IST

టాలెంటెడ్ నటి అయినా రుహాని శర్మ ని మళ్ళీ తన సినిమాలో తీసుకున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. అతని మొదటి సినిమా 'హిట్' లో చేసిన రుహాని, ఇప్పుడు శైలేష్, వెంకటేష్ తో చేస్తున్న 'సైంధవ్‌'లో కీలక పాత్ర పోషిస్తోంది.

Venkatesh Daggubati: సైంధవ్ లో రుహాని శర్మ ఏమి చేస్తోందో తెలుసా

వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati) కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) 'సైంధవ్' (Saindhav) అనే సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం విశాఖపట్నం (Visakhapatnam) లో జరుగుతోంది అని తెలిసింది. ఈ సినిమా వెంకటేష్ కి 75వ (75th Film) సినిమా అవటం కూడా విశేషమే. ఇందులో ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ అది ఎవరు చేస్తున్నారో కూడా చిత్ర నిర్వాహకులు విడుదల చేస్తున్నారు. ఆమధ్య శ్రద్ధ శ్రీనాధ్ (Shraddha Srinath) లుక్ ని విడుదల చేసి ఆమె కథానాయకిగా ఇందులో చేస్తోంది అని చెప్పారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ Nawazuddin Siddique) ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడరు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

ruhanisharma.jpg

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఇంకో పాత్రని పరిచయం చేస్తున్నారు. ఇందులో డాక్టర్ రేణు పాత్రను రుహాని శర్మ (Ruhani Sharma) పోషిస్తోంది. రుహాని శర్మ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'హిట్' (Hit) లో వుంది. ఇప్పుడు అదే రుహాని 'సైంధవ్‌'లో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో రుహానీ శర్మ ఎథ్నిక్ వేర్‌లో సీరియస్ గా కనిపిస్తోంది. 'దసరా' సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న విడుదల కానుంది.

Updated Date - 2023-04-22T09:58:35+05:30 IST