RRR- Oscar: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఆరుగురికి స్థానం!

ABN , First Publish Date - 2023-06-29T12:56:57+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ అందుకొని అంతర్జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికీ ఏదో ఒక వైపు నుంచి చిత్రానికి గుర్తింపు లభిస్తూనే ఉంది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అరుదైన గౌరవం దక్కింది.

RRR- Oscar: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఆరుగురికి స్థానం!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ (Oscar)అవార్డ్‌ అందుకొని అంతర్జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రం. అంతే కాదు అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో అవార్డులను అందుకుంది. ఇప్పటికీ ఏదో ఒక వైపు నుంచి చిత్రానికి గుర్తింపు లభిస్తూనే ఉంది. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ కమిటీలో చోటు దక్కించుకుంది(RRR Team in Oscar Committee). ‘ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌(Ram charan), ఎన్టీఆర్‌తో(NTR)పాటు సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani), గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose) ఛాయగ్రాహకుడు కె.కె.సెంథిల్‌, (K Senthil) ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌లకు (Sabu cyril) ఆస్కార్‌ కమిటీలో స్థానం దక్కింది. ఈ ప్రకటన రావడంతో సోషల్‌ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అయిన దర్శకుడు రాజమౌళికి కూడా కమిటీలో సభ్యత్వం వచ్చుంటే బావుండేది అని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆస్కార్‌ కమిటీలో పది వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా ఆహ్వానాలు అందుకున్న వారితో కలిపితే 10.817 మందికి చేరుతుంది. ఇందులో ఓటు వేసే హక్కు 9375 మందికి ఉంటుంది. 96వ ఆస్కార్‌ అవార్డు వేడుకను వచ్చే ఏడాది మార్చి 10న నిర్వహించనున్నారు. దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్‌ నుంచి కరణ్‌జోహార్‌లకు కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానం పలికింది.

2.jpg

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండ వరల్డ్‌ వైడ్‌గా ఎంతో ఆదరణ పొందింది. భారీ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ను అందుకొంది.

Updated Date - 2023-06-29T13:13:03+05:30 IST