Trisha: త్రిషని లైన్‌లో పెట్టేశారు..

ABN , First Publish Date - 2023-11-15T16:22:39+05:30 IST

ఇటీవల పాటల రికార్డింగ్‌తో తన తాజా చిత్రం ‘త్రిష’కు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పుకొచ్చిన యువ దర్శకుడు ఆర్.కె.గాంధీ.. చిత్రాన్ని కూడా ఆ వెంటనే లైన్‌లోకి తెచ్చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించినట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ శివారు మియాపూర్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సీనియర్ హీరో సుమన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Trisha: త్రిషని లైన్‌లో పెట్టేశారు..
Suman in Trisha Movie

ఇటీవల పాటల రికార్డింగ్‌తో తన తాజా చిత్రం ‘త్రిష’ (Trisha)కు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పుకొచ్చిన యువ దర్శకుడు ఆర్.కె.గాంధీ (RK Gandhi).. చిత్రాన్ని కూడా ఆ వెంటనే లైన్‌లోకి తెచ్చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించినట్లుగా తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) తరువాత దేవుళ్ళ పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సీనియర్ హీరో సుమన్ (Suman) ఈ చిత్రంలో దైవాంశ సంభూతుడిగా ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ‘సంభవామి యుగే యుగే’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. హైదరాబాద్ శివారు మియాపూర్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో సుమన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ కొన్ని ఫొటోలను విడుదల చేశారు.

ఈ ఫొటోలలో హీరో సుమన్‌ని చూస్తుంటే.. ఆయన కెరీర్‌లో ఇది మరో వైవిధ్యభరిత చిత్రమనేది తెలుస్తోంది. అలాగే దేవుని సన్నిధిలో ఓ పవర్‌ఫుల్ పాటని చిత్రీకరిస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కిరణ్ కుమార్ గుడిపల్లి సమర్పిస్తున్నారు. హనుమంత రాయప్ప లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను ఈ సినిమా కోసం షూట్ చేయనున్నారని తెలుస్తోంది. (Trisha Movie Latest Update)


suman.jpg

ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు? చెడుపై మంచి ఎలా గెలిచింది? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ అప్పాజీ, ఆనంద్ మట్ట వంటి వారంతా ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఎం.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించనున్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లాడబోయే వ్యక్తి ఇతనే..

**********************************

*Mehreen Pirzada: అదే నాకు ‘స్పార్క్’ మూమెంట్‌..

**********************************

*Malavika Mohanan: అభిమానుల మనసుల్లో మాళవిక గిలిగింతలు

********************************

*Aishwarya Rai: ఐష్ టాయిలెట్స్ కడగడానికి కూడా ఆ క్రికెటర్ పనికిరాడంటూ.. నెటిజన్లు ఫైర్

*********************************

Updated Date - 2023-11-15T16:22:40+05:30 IST