RituVarma: చియాన్ ఆదుకునేనా.. రీతూ వ‌ర్మ‌కు బ్రేక్ వ‌చ్చేనా

ABN , First Publish Date - 2023-10-31T22:18:40+05:30 IST

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌నానుడి మ‌న హైద‌రాబాదీ రీతూవ‌ర్మకు వంద శాతం స‌రిపోతుంది. అందానికి అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నప్ప‌టికీ ఎందుక‌నో స్టార్ స్టేట‌స్‌ను అందుకోలేక పోతున్న‌ది. వ‌రుస బెట్టి పెద్ద‌ హీరోల చిత్రాలు చేస్తున్నా రావ‌లిసినంత మైలేజ్ అమ్మ‌డికి రావ‌డం లేదు. ఓ అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెన‌క‌కు అన్న చందంగా ఉంది.

RituVarma: చియాన్ ఆదుకునేనా.. రీతూ వ‌ర్మ‌కు బ్రేక్ వ‌చ్చేనా
ritu varma, vikram

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌నానుడి మ‌న హైద‌రాబాదీ రీతూవ‌ర్మ (Ritu Varma)కు వంద శాతం స‌రిపోతుంది. అందానికి అందం, న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నప్ప‌టికీ ఎందుక‌నో స్టార్ స్టేట‌స్‌ను అందుకోలేక పోతున్న‌ది. వ‌రుస బెట్టి పెద్ద‌ హీరోల చిత్రాలు చేస్తున్నా రావ‌లిసినంత మైలేజ్ అమ్మ‌డికి రావ‌డం లేదు. ఓ అడుగు ముందుకేస్తే రెండ‌డుగులు వెన‌క‌కు అన్న చందంగా ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ 16 సినిమాల్లో అధిక శాతం విజ‌యాలే ఉన్నా ఈ సుంద‌రికి అదృష్టం అంత‌గా క‌లిసి రావ‌డం లేదు. తెలుగులో గ‌త సంవ‌త్స‌రం ఒకే ఒక జీవితం సినిమా త‌ర్వాత మ‌రో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు.

ritu-varma.jpg

హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు మొద‌ట 2012లో అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. అందులో నట‌న‌కు గాను అవార్డు సైతం ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత జూ.ఎన్టీఆర్ బాద్ షా సినిమాలో కాజ‌ల్ ఫ్రెండ్‌గా న‌టించి తొలిసారి వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆపై.. హీరోయిన్‌గా నా రాకుమారుడు, ప్రేమ ఇష్క్‌ కాద‌ల్, నాని ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాల్లో న‌టించినా 2016లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ట‌క్ జ‌గ‌దీశ్, వ‌రుడు కావ‌లెను, ఒకే ఒక జీవితం సినిమాలు చేసింది.

ritu-var.jpg

సినిమాల్లో నిండైనా చీర‌క‌ట్టులో అచ్చ తెలుగ‌మ్మాయి పాత్ర‌ల్లో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక అభిమానులను సంపాదించుకున్న ఈ భామ సోష‌ల్ మీడియాలో మాత్రం అందుకు విరుద్ధంగా హాట్‌ హాట్ ఫొటోలు షేర్‌ చేస్తూ కుర్ర‌కారును నిద్ర‌కు దూరం చేస్తున్న‌ది. గ‌తంలోనే గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి కూడా సిద్ధ‌మే అని ముద్దుగుమ్మ‌ చెప్పిన‌ప్ప‌టికీ సినిమా అవ‌కాశాలు మాత్రం పొంద‌లేక‌పోతున్న‌ది. లేకుంటే రీతూవ‌ర్మే కావాల‌ని ఛాన్స్‌ల‌ను త‌గ్గించుకుంటుందా అని అభిమానులు అనుకుంటున్నారు.


తెలుగులోనే కాకుండా స్టార్ హీరోలు దుల్క‌ర్ స‌ల్మాన్‌కు జోడీగా రీతూవ‌ర్మ‌ త‌మిళంలో చేసిన కన్నుమ్ కన్నుమ్ కొల్లయ్యదితాల్ (క‌నులు క‌నులు క‌లిశాయంటే), విశాల్‌తో ఈ మ‌ధ్య‌ చేసిన‌ మార్క్ అంటోనీ మంచి విజ‌యాన్ని సాధించిన‌ప్ప‌టికీ అమ్మ‌డి కేరీర్ మాత్రం తోటి హీరోయిన్స్‌కు స‌మానంగా స్పీడందుకోవ‌డం లేదు.

vikram.jpg

ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్(Chiyaan Vikram ) వంటి స్టార్ హీరోతో చేస్తున్న దృవ‌న‌క్ష‌త్రం(Dhruva Natchathiram) సినిమా ఒక‌టి మాత్ర‌మే చేతిలో ఉంది. ఎప్పుడో 2017లో ప్రారంభమైన ఈ సినిమా అన్ని అవ‌రోధాల‌ను అధిగ‌మించి ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. దీంతో అమ్మ‌డు త‌న ఆశ‌ల‌న్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్న‌ది. చాలా గ్యాప్ త‌ర్వాత గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు హ‌రీశ్ జ‌య‌రాజ్(Harris Jayaraj) సంగీతం అందిస్తున్నారు. చూద్దాం ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో.

Updated Date - 2023-10-31T22:22:04+05:30 IST